ఎట్ట‌కేల‌కి మేడే సంద‌ర్భంగా విడుద‌ల‌వుతున్న 'అర్జున్ సుర‌వ‌రం'

Sun,April 21, 2019 11:06 AM
Arjun Suravaram release date fixed

యంగ్ హీరో నిఖిల్‌, అందాల భామ లావ‌ణ్య త్రిపాఠి ప్ర‌ధాన పాత్ర‌ల‌లో టి.ఎన్. సంతోష్ తెర‌కెక్కించిన చిత్రం అర్జున్ సుర‌వరం. బి.మధు (ఠాగూర్ మధు) సమర్పణలో మూవీ డైనమిక్స్ ఎల్ఎల్‌పి, ఔరా సినిమాస్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్లపై రాజ్ కుమార్ ఆకెళ్ల, కావ్య వేణుగోపాల్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మార్చి లోనే విడుద‌ల కావ‌ల‌సి ఉన్న ఈ చిత్రం ప‌లు కార‌ణాల వ‌ల‌న వాయిదా ప‌డింది. ముద్ర అనే టైటిల్‌ని ముందుగా ఈ చిత్రానికి ఫిక్స్ చేశారు. కాని అదే పేరుతో జ‌గ‌ప‌తి బాబు చిత్రం విడుద‌ల కావ‌డంతో పేరు మార్చి అర్జున్ సుర‌వ‌రం పేరుతో చిత్రాన్ని విడుద‌ల చేస్తున్నారు. మేడే సంద‌ర్భంగా మే 1న మూవీని రిలీజ్ కానుంది. ఇప్ప‌టికే విడుద‌లైన సాంగ్స్, టీజ‌ర్ ప్రేక్ష‌కుల‌ని అల‌రించాయి. శ్యామ్ సీఎస్ చిత్రానికి స్వ‌రాలు స‌మ‌కూర్చారు. త‌మిళంలో సూప‌ర్ సక్సెస్ అందుకున్నక‌నిత‌న్‌కి రీమేక్‌గా అర్జున్ సుర‌వ‌రం చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కిన ఈ చిత్రంలో నిఖిల్ జ‌ర్నలిస్ట్ పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు. వెన్నెల కిషోర్, పోసాని కృష్ణమురళి, తరుణ్ అరోరా, సత్య, నాగినీడు ముఖ్య పాత్ర‌ల‌లో క‌నిపించ‌నున్నారు.

1369
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles