అర్జున్ రెడ్డి రీమేక్ స్పెష‌ల్ పోస్ట‌ర్

Wed,November 7, 2018 07:23 AM
arjun reddy remake special poster

టాలీవుడ్‌లో బ్లాక్ బ‌స్టర్ హిట్‌గా నిలిచిన అర్జున్ రెడ్డి చిత్రం ప్ర‌స్తుతం త‌మిళం, హిందీ భాష‌ల‌లో రీమేక్ అవుతున్న సంగ‌తి తెలిసిందే. త‌మిళంలో వ‌ర్మ అనే టైటిల్‌తో తెర‌కెక్కుతున్న ఈ చిత్రం హిందీలో క‌బీర్ సింగ్ అనే టైటిల్‌తో రూపొందుతుంది. త‌మిళంలో చియాన్ విక్రమ్ తనయుడు ధృవ్ హీరోగా వర్మ టైటిల్ తో చిత్రం రూపొందుతుంది. బోల్డ్ కంటెంట్ తో సహజత్వ ప్రేమకథగా తమిళంలో రూపొందుతున్న ఈ సినిమాని బాల తెరకెక్కిస్తున్నాడు. నేషనల్ అవార్డు విన్నర్ రాజు మురుగున్ చిత్రానికి డైలాగ్స్ అందించాడు. తెలుగులో అర్జున్ రెడ్డి చిత్రం భారీ విజయం సాధించడంతో తమిళంలోను ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. క‌థానాయికగా మేఘా చౌద‌రి న‌టిస్తుంది. ఇటీవ‌ల చిత్ర టీజ‌ర్ విడుదల కాగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. దీపావ‌ళి సంద‌ర్భంగా స్పెష‌ల్ పోస్ట‌ర్ విడుద‌ల చేశారు. ఇందులో చిత్రానికి సంబంధించి నవంబ‌ర్ 12న ఓ అనౌన్స్ మెంట్ చేస్తామ‌ని అన్నారు. వ‌ర్మ చిత్రంలో ముఖ్య పాత్ర కోసం ఈశ్వరీరావుని ఎంపిక చేసినట్టు తెలుస్తుంది.

2971
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles