ట్రెడిషనల్ లుక్ లో అర్జున్ రెడ్డి భామ

Tue,May 8, 2018 04:07 PM
arjun reddy girl in traditional getup

టాలీవుడ్ లో తొలిసారిగా ఓ నటిపై బయోపిక్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తెలుగు తెరపై చెరగని ముద్ర వేసుకున్న అందాల నటి సావిత్రి జీవితంపై వస్తున్న ఈ సినిమాపై జనాలలో చాలా ఆసక్తి నెలకొంది. మే 9న తెలుగులో విడుదల కానున్న ఈ చిత్రం మే 11న తమిళంలో విడుదల కానుంది. కొద్ది రోజులుగా చిత్రానికి సంబంధించి పాత్రలని పరిచయం చేస్తూ వస్తున్నారు. సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ నటించగా..ఆమె భర్త జెమిని గణేష్ పాత్రలో దుల్కన్ సల్మాన్ నటించారు.ఇక సమంత మధరువాణిగా, విజయ్ దేవరకొండ విజయ్ ఆంటోని పాత్రలలో కనిపించనున్నారు.

మహానటుడు ఎస్వీ రంగారావు పాత్రలో మోహన్ బాబు నటించగా, కేవీ రెడ్డి పాత్రలో క్రిష్, ఎల్వీ ప్రసాద్ పాత్రలో అవసరాల శ్రీనివాస్, దర్శకనిర్మాత చక్రపాణి పాత్రలో ప్రకాశ్ రాజ్ మహానటి చిత్రంలో కనిపించనున్నారు. ఇక సావిత్రి పెదనాన్న కేవి చౌదరి పాత్రలో రాజేంద్ర ప్రసాద్, అలమేలు పాత్రలో మాళవిక నాయర్ కనిపించనున్నారు. ఇక అర్జున్ రెడ్డి చిత్రంతో అందరి దృష్టి ఆకర్షించిన షాలిని పాండే నటి సుశీల పాత్రలో కనిపించనున్నారు. ఏదేమైన మొన్నటి వరకు సైలెంట్ గా ఉన్న చిత్ర దర్శకుడు రీసెంట్ గా నాని వాయిస్ తో పాత్రలు పరిచయం చేస్తూ జనాలలో సినిమాపై ఆసక్తిని కలిగించడం విశేషం.

మరోవైపు మహానటి సినిమా థియేటర్లకు వస్తున్న నేపథ్యంలో, థియేటర్ వచ్చి సినిమా చూసి ఈ సెలబ్రేషన్ లో భాగస్వాములు కావాలని సినీ ప్రముఖులకు ఈ సినిమా టీమ్ ఆహ్వాన పత్రికలు పంపుతున్నారు. జీడిపప్పు మిఠాయితో కూడిన బాక్స్ తో పాటు ఆహ్వాన పత్రికలు పంపించారు. బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ ఇన్విటేషన్ ని తన ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ మహానటి టీంకి బెస్ట్ విషెస్ అందించారు.
3038
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles