జాన్వీకి స‌పోర్ట్‌గా అర్జున్ క‌పూర్‌..

Wed,June 6, 2018 09:24 AM
arjun kapoor supports to jhanvi

బోని క‌పూర్‌, శ్రీదేవిల‌ గారాల పట్టి జాన్వీ క‌పూర్ త్వ‌ర‌లో ద‌ఢఖ్ సినిమాతో వెండితెర‌కి ప‌రిచ‌యం కానున్న సంగ‌తి తెలిసిందే. తొలి సినిమా కూడా విడుద‌ల కాక‌ముందే ఈ అమ్మ‌డికి విప‌రీతంగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. అభిమానులే కాదు మీడియా కూడా జాన్వీపై ప్ర‌త్యేక శ్ర‌ద్ధ పెడుతుంది. ఆమెకి సంబంధించి ప్రతి రోజు ప్ర‌త్యేక క‌థ‌నాలు ప్ర‌చురిస్తుంది. అయితే రీసెంట్‌గా ఓ వెబ్ సైట్ పొట్టి డ్రెస్ ధరించిన జాన్వీ ఫోటో పోస్ట్ చేసి, ఆమె ఏదో వేసుకోవ‌డం మ‌రచిపోయింద‌నే కామెంట్‌తో ఓ శీర్షిక ప్ర‌చురించింది. ఇది అర్జున్ కంట ప‌డ‌డంతో వెంట‌నే త‌న ట్విట్ట‌ర్ ద్వారా స్పందించాడు. పెద్ద ప‌త్రిక విమ‌ర్శ‌కుల‌కి ఇంత‌ ప్రాముఖ్య‌త ఇవ్వ‌డం హాస్యాస్ప‌దంగా ఉంది. ఇలాంటి వార్త‌ల‌ని త‌గ్గించ‌డం వ‌ల‌న విమ‌ర్శ‌కుల‌ని మీరు త‌గ్గించిన వారు అవుతారు అని అన్నారు. త‌న పిన్ని శ్రీదేవి మ‌ర‌ణం త‌ర్వాత అర్జున్ క‌పూర్.. జాన్వీ, ఖుషీల‌ని సొంత అన్న‌లా చూసుకుంటున్నాడు. వారికి ఏ లోటు రాకుండా చూసుకుంటాన‌ని అర్జున్ క‌పూర్ ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పిన సంగ‌తి తెలిసిందే.
4179
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS