కోమ‌లి హిందీ రీమేక్‌లో అర్జున్ క‌పూర్

Sun,September 22, 2019 12:31 PM

ప్ర‌ముఖ నిర్మాత బోనీ క‌పూర్ త‌న‌యుడు అర్జున్ క‌పూర్ తమిళ సూప‌ర్ హిట్ చిత్రం కోమ‌లి రీమేక్ చేసేందుకు సిద్ధ‌మ‌య్యాడు. జ‌యం ర‌వి, కాజ‌ల్ అగ‌ర్వాల్‌, సంయుక్త హెగ్డే ప్ర‌ధాన పాత్ర‌ల‌లో నూత‌న ద‌ర్శ‌కుడు ప్రదీప్ కోమ‌లి చిత్రాన్ని తెర‌కెక్కించాడు. ఆగ‌స్ట్ 15న విడుద‌లైన‌ ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. 16 సంవత్సరాల తరువాత కోమా నుండి మేల్కొన్న వ్యక్తి యొక్క కథ ఆధారంగా చిత్రాన్ని రూపొందించారు . నేటి యువ‌త సోష‌ల్ మీడియాకి బానిసై త‌మ విలువైన జీవితాల‌ని కోల్పోతున్న సంగ‌తి తెలిసిందే. అయితే యువ‌త‌లో మ‌రింత అవ‌గాహ‌న క‌ల్పించేందుకు ఈ చిత్రం రూపొందించారు. తాజాగా ఈ చిత్రం అన్ని భాష‌ల రీమేక్ రైట్స్ బోనీ నిర్మాణ సంస్థ బేవ్యూ వ్యూ ప్రాజెక్ట్స్ సొంతం చేసుకుంది. ఈ సంద‌ర్బంగా బోనీ మాట్లాడుతూ.. ఇందుకు మేము చాలా సంతోషిస్తున్నాము. హిందీ రీమేక్‌లో అర్జున్ క‌పూర్ న‌టించ‌నున్నాడు అని తెలిపారు. తండ్రితో క‌లిసి అర్జున్ క‌పూర్ చేస్తున్న ఈ ప్ర‌యోగంపై భారీ అంచ‌నాలు నెల‌కొని ఉన్నాయి. త్వ‌ర‌లో ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి పూర్తి వివ‌రాలు వెల్ల‌డించ‌నున్నారు.

1064
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles