కూతురి బర్త్ డే కోసం సింగపూర్ వెళ్లిన బన్నీ

Fri,November 24, 2017 03:48 PM
arha frst birthday celebrations at singapore

సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికి ఫ్యామిలీతో గడిపే క్షణాలు చాలా ఆనందాన్ని ఇస్తాయంటున్నారు మన టాలీవుడ్ హీరోలు. సూపర్ స్టార్ మహేష్ గ్యాప్ దొరికితే చాలు ఫ్యామిలీతో కలిసి షికారుకు వెళుతుంటాడు. ఇక బన్నీ కూడా తన ఫ్యామిలీ కోసం చాలా టైం కేటాయిస్తుంటాడు. తాజాగా తన కూతురు ఫస్ట్ బర్త్ డే సందర్భంగా సింగపూర్ ట్రిప్ వేశాడు. అక్కడే అర్హా తొలి బర్త్ డే వేడుకని నిర్వహించాడు. తన కుమారుడు అయాన్ ఫస్ట్ బర్త్ డేని కూడా సింగపూర్ లో జరిపాడు బన్నీ. రెండో పుట్టిన రోజును దుబాయ్ లో సెలబ్రేట్ చేశాడు. ఇక అర్హా బర్త్ డే రోజున తన ఇన్ స్ట్రాగ్రామ్ ఖాతాని తెరచిన బన్నీ, తొలి పోస్ట్ గా అర్హా ఫోటోని షేర్ చేసి జన్మదిన శుభాకాంక్షల తెలిపాడు. ప్రస్తుతం వక్కంతం వంశీ దర్శకత్వంలో నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా అనే చిత్రం చేస్తున్నాడు అల్లు అర్జున్ . రామలక్ష్మి సినీ క్రియేషన్స్ పతాకంపై శిరీష్, శ్రీధర్ లగడపాటి నిర్మిస్తున్న ఈ చిత్రంలో అను ఇమ్మాన్యుయేల్ కథానాయికగా నటిస్తుంది. విశాల్-శేఖర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు . వచ్చే ఏడాది ఏప్రిల్లో మూవీ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.

2038
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles