గోవాలో అర్హ బ‌ర్త్ డే వేడుక‌లు

Thu,November 22, 2018 08:29 AM
Arha birthday celebrations in goa

అల్లు అర్జున్, స్నేహా రెడ్డి దంపతుల ముద్దుల కూతురు అర్హ నిన్న (న‌వంబ‌ర్ 21) రెండో సంవ‌త్స‌రంలోకి అడుగుపెట్టిన సంగ‌తి తెలిసిందే. ముందుగా త‌న ట్విట్ట‌ర్ ద్వారా కూతురికి శుభాకాంక్షలు తెలియ‌జేసిన బ‌న్నీ ఆ త‌ర్వాత అర్హా బర్త్‌డేను కుటుంబ సమేతంగా గోవాలో సెలబ్రేట్‌ చేసుకున్నట్టు తెలిపారు. అంతేకాదు బ‌ర్త్‌డేకి సంబంధించిన ఫోటోలు కూడా షేర్ చేశారు అల్లు అర్జున్‌. బన్నీ త‌న కూతురికి తన పేరుతో పాటు భార్య పేరులోని కొన్ని అక్షరాలతో అర్హ అని పేరు పెట్టాడు . అర్జున్‌లోని AR, స్నేహలోని HAను కలిపి అర్హ అని నామకరణం చేశాడు. హిందూ సంప్రదాయ ప్రకారం అర్హ అంటే లార్డ్ శివ, ఇస్లామిక్‌లో నిర్మలమైన అని అర్థం. ఫ్యామిలీని ఎక్కువగా ఇష్ట‌ప‌డే బ‌న్నీ గ‌త ఏడాది న‌వంబ‌ర్ 21న కూతురి మొద‌టి బ‌ర్త్ డే సంద‌ర్భంగా ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేసి తొలి ఫోటోగా కూతురి పిక్ పెట్టి అభిమానుల‌కి చాలా ఆనందాన్ని అందించాడు. బ‌న్నీ దంప‌తుల‌కి అయాన్ అనే చిన్నారి కూడా ఉన్న సంగ‌తి తెలిసిందే. బ‌న్నీ త్వ‌ర‌లో త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేయ‌నున్నాడు. ఆ త‌ర్వాత 96 రీమేక్‌లో కూడా న‌టించ‌నున్న‌ట్టు తెలుస్తుంది.

1691
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles