ఘ‌నంగా అర్చ‌న వివాహం.. హాజ‌రైన సినీ ప్ర‌ముఖులు

Thu,November 14, 2019 10:37 AM

సినీ నటి అర్చ‌న వివాహం హెల్త్‌కేర్‌ సంస్థ వైస్‌ ప్రెసిడెంట్‌ జగదీశ్‌తో ఘ‌నంగా జ‌రిగింది. ఈ తెల్లవారుజామున 1:30 ని.ల‌కి మూడుముళ్ల బంధంతో అర్చన,జగదీశ్‌లు ఒక్క‌టి కాగా, వీరి పెళ్ళి వేడుక‌లో ప‌లువురు సినీ సెల‌బ్రిటీలు సంద‌డి చేశారు. పెళ్ళికి కొద్ది గంట ముందు రిసెప్షన్ వేడుక నిర్వ‌హించారు. గచ్చిబౌలిలోని కొల్లమాధవరెడ్డి గార్డెన్‌లో అర్చ‌న వివాహం జ‌రిగింది. అక్టోబ‌ర్ 3న హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని రాడిసన్ బ్లూ హోటల్‌లో అర్చ‌న‌.. జగదీశ్‌తో నిశ్చితార్ధం జ‌రుపుకున్న సంగ‌తి తెలిసిందే.తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో కలిపి సుమారుగా 40 సినిమాల్లో న‌టించిన అర్చ‌న చివ‌రిగా ‘వజ్ర కవచధర గోవింద’ చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది.

మరిన్ని ఫోటోల కోసం క్లిక్‌ చేయండి




3091
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles