అంచ‌నాలు పెంచేసిన 'అర‌వింద స‌మేత' ట్రైల‌ర్

Wed,October 3, 2018 08:11 AM
Aravindha Sametha Theatrical Trailer  released

నంద‌మూరి అభిమానులు ఎంత‌గానో ఎదురు చూస్తున్న అర‌వింద స‌మేత ట్రైల‌ర్ నిన్న సాయంత్రం జ‌రిగిన ప్రీ రిలీజ్ వేడుక‌లో విడుద‌లైంది. క‌ళ్యాణ్ రామ్ చిత్ర ట్రైల‌ర్‌ని లాంచ్ చేశారు. ఇందులో ‘ముప్పై ఏండ్ల నాడు మీ తాత కత్తి పట్టినాడంటే అది అవసరం. అదే కత్తి మీ నాయన ఎత్తినాడంటే అది వారసత్వం. అదే కత్తి నువ్వు దూసినావంటే అది లక్షణం. ఆ కత్తి నీ బిడ్డనాటికి లోపమైతుందా’ అంటూ రాఘవ (ఎన్టీఆర్) నాయనమ్మ చెప్పే డైలాగ్ ట్రైలర్‌కే హైలైట్ అనిపిస్తుంది. ఇక ‘వాడిదైన రోజున ఎవడైనా కొట్టగలడు. అసలు గొడవ రాకుండా ఆపుతాడు చూడు.. వాడు గొప్పోడు. వాడే గొప్ప’, ‘వందడుగుల్లో నీరు పడుతుందంటే 99 అడుగుల వరకు తవ్వి ఆపేసేవాడిని ఏమంటారు. మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను. ఈ ఒక్క అడుగు వందడుగులుతో సమానం సార్ తవ్వి చూడండి’.. అంటూ ట్రైల‌ర్‌లో ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్స్ సినిమాపై భారీ అంచ‌నాలు పెంచేశాయి త్రివిక్ర‌మ్ తెర‌కెక్కించిన ఈ చిత్రం రాయ‌ల‌సీమ నేప‌థ్యంలో యాక్ష‌న్ డ్రామాగా తెర‌కెక్క‌గా ఇందులో పూజా హెగ్డే, ఈషా రెబ్బా క‌థానాయిక‌లుగా నటించారు. జ‌గ‌ప‌తిబాబు ప‌వ‌ర్ ఫుల్ పాత్ర పోషించారు. నాగ బాబు, న‌వీన్ చంద్ర కూడా వారి వారి పాత్ర‌ల‌తో ఆక‌ట్టుకోనున్నారు. థ‌మ‌న్ అందించిన సంగీతం సినిమాపై ఎక్స్‌పెక్టేష‌న్స్ పెంచింది. ట్రైల‌ర్‌పై మీరు ఓ లుక్కేయండి.

2592
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles