పెనివిటి సాంగ్‌తో సంద‌డి చేయ‌నున్న ఎన్టీఆర్

Tue,September 18, 2018 12:51 PM
Aravindha Sametha second song released on tommorrow

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, మాట‌ల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం అరవింద సమేత. రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 13న విడుదల కానుంది. సెప్టెంబ‌ర్ 20న చిత్ర ఆడియోని విడుద‌ల చేయాల‌ని మేక‌ర్స్ భావించారు. ఇక కొద్ది రోజులుగా చిత్రానికి సంబంధించి ఒక్కో లిరిక‌ల్ సాంగ్ విడుద‌ల చేస్తూ వ‌స్తున్నారు మేక‌ర్స్‌. ఇటీవ‌ల విడుద‌లైన మొద‌టి సాంగ్‌లో పూజా హెగ్డే .. ఎన్టీఆర్ ని చూసి టఫ్ గా కనిపిస్తారు కాని మాట వింటారు.. పర్లేదు అనే డైలాగ్ అభిమానుల‌ని అల‌రించింది. ఇక రెండో సాంగ్‌గా పెనివిటి అంటూ సాగే పాట‌ని రేపు సాయంత్రం 4.50ని.ల‌కు విడుద‌ల చేయ‌నున్నారు. ఈ విష‌యాన్ని పోస్ట‌ర్ ద్వారా తెలియ‌జేశారు. రాయ‌ల‌సీమ స్లాంగ్‌లో ఈ పాట ఉండ‌నున్న‌ట్టు తెలుస్తుంది. ‘అరవింద సమేత’ చిత్రంలో ఎన్టీఆర్ రెండు విభిన్న పాత్రలలో కనిపించనున్నాడని జోరుగా ప్రచారం జరుగుతుంది. ప్రధమార్ధంలో సిద్ధార్ధ్ గౌతమ్ పాత్రలో కనిపించనున్న ఎన్టీఆర్ ద్వితీయార్ధంలో వీర రాఘవగా కనిపించి అలరించనున్నాడట. ఎస్ఎస్ థ‌మ‌న్ చిత్రానికి సంగీతం అందించిన తెలిసిందే.

2247
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS