అర‌వింద స‌మేత నుండి క‌వ‌ర్ సాంగ్ వీడియో విడుద‌ల‌

Tue,October 16, 2018 09:49 AM
Aravindha Sametha  Reddamma Thalli  Cover Version

జూనియ‌ర్ ఎన్టీఆర్, పూజా హెగ్డే ప్ర‌ధాన పాత్ర‌ల‌లో త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ తెర‌కెక్కించిన చిత్రం అర‌వింద స‌మేత‌. రాయ‌లసీమ నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ చిత్రం ఇంట‌నే కాకుండా బ‌య‌ట కూడా ర‌చ్చ చేస్తుంది. భారీ వ‌సూళ్ళ‌తో ఈ మూవీ బాక్సాఫీస్‌ని షేక్ చేస్తుంది. ఇప్ప‌టికే వంద కోట్ల‌కి పైగా వ‌సూళ్ళు రాబ‌ట్టిన ఈ చిత్రం రానున్న రోజుల‌లో మ‌రిన్ని క‌లెక్ష‌న్స్ రాబ‌డుతుంద‌ని అంటున్నారు. అయితే మూవీ రిలీజ్ త‌ర్వాత కూడా చిత్రానికి సంబంధించి ప‌లు వీడియోలు విడుద‌ల చేస్తూ సినిమాపై మ‌రింత ఎక్స్‌పెక్టేష‌న్స్ పెంచుతుంది చిత్ర బృందం. తాజాగా సినిమా క్లైమాక్స్‌లో వచ్చే రెడ్డమ్మ తల్లి పాట కవర్‌ వర్షన్‌ను రిలీజ్‌ చేసింది. ఈ పాటను ప్రముఖ రాయలసీమ జానపద గాయకుడు పెంచల్‌ దాస్‌ స్వయంగా రాసి పాడారు. ఈ పాట అభిమానుల‌ని ఎంత‌గానో అలరిస్తుంది. మీరు ఈ సాంగ్‌పై ఓ లుక్కేయండి.

3070
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles