క్లాస్ లుక్‌లో 'అర‌వింద స‌మేత‌'

Sun,May 20, 2018 11:02 AM
Aravindha Sametha Motion Poster revealed

ఎన్టీఆర్ 28వ చిత్రం త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతుండ‌గా, ఈ చిత్రానికి అర‌వింద స‌మేత అనే టైటిల్ ఫిక్స్ చేసి నిన్న ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే. ఇందులో ఎన్టీఆర్ మాస్ లుక్‌లో సిక్స్ ప్యాక్‌తో క‌నిపించాడు. రాయల‌సీమ బ్యాక్‌గ్రౌండ్‌లో ఈ చిత్రం తెర‌కెక్కుతుంది. ఇక ఈ రోజు ఎన్టీఆర్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా ఎన్టీఆర్‌, పూజా హెగ్డే క‌లిసి ఉన్న క్లాస్ లుక్ పిక్‌తో పాటు మోష‌న్ పోస్ట‌ర్ విడుద‌ల చేసింది చిత్ర యూనిట్‌. ఇది అభిమానుల‌ని ఎంత‌గానో అల‌రిస్తుంది. చిత్రంలో రాఘ‌వ పాత్ర‌ని ఎన్టీఆర్ పోషిస్తుండ‌గా, అర‌వింద పాత్ర‌లో పూజా హెగ్డే సంద‌డి చేయ‌నుంద‌ని స‌మాచారం.హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బేనర్ పై రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రానికి థ‌మ‌న్ సంగీతం అందిస్తున్నాడు. ఎన్టీఆర్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా విడుద‌లైన రెండు పోస్ట‌ర్స్‌కి సూప‌ర్భ్ రెస్పాన్స్ వ‌స్తుంది. ఆయ‌న బ‌ర్త్‌డే సంద‌ర్భంగా అభిమానులు సేవా కార్య‌క్ర‌మాలు చేస్తున్నారు. సినీ సెల‌బ్రిటీలు సోష‌ల్ మీడియా వేదిక‌గా ఆయ‌న‌కి శుభాకాంక్ష‌ల వెల్లువ కురిపిస్తున్నారు.

2962
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS