ఎన్టీఆర్ చిత్రానికి లీకుల బెడద

Fri,August 10, 2018 04:34 PM
Aravinda Sametha pics leaked

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం అరవింద సమేత. రాయల సీమ బ్యాక్ డ్రాప్ లో ఈ మూవీ తెరకెక్కుతుందని తెలుస్తుండగా, ఈ చిత్ర బృందాన్ని లీకుల సమస్య వేధిస్తుంది. ఇప్పటికే మూవీ స్టిల్స్ కొన్ని బయటకి రాగా, దర్శకుడు సెట్ లో పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయినప్పటికి తాజాగా మరి కొన్ని మూవీ స్టిల్స్ బయటకి వచ్చాయి. ఇవి యాక్షన్ సీన్స్ కి సంబంధించినవిగా తెలుస్తుంది. అయితే ఇప్పుడు లీక్ అయిన ఫోటోస్ ఎడిటింగ్ రూం నుండి బయటకు వచ్చినట్టు చెబుతున్నారు. లీకుల బెడద చిత్ర యూనిట్ కి పెద్ద తలనొప్పిగా మారడంతో దీనికి కారణమైన వారెవరో తెలుసుకునే పనిలో నిర్మాతలు ఉన్నారు. దసరా కానుకగా ఈ మూవీ భారీ అంచనాలతో విడుదల కానుంది. హారిక హాసిని క్రియేషన్స్ పతాకంపై రాధాకృష్ణ నిర్మిస్తున్నఈ చిత్రంలో ఎన్టీఆర్కు జోడీగా పూజా హెగ్డే నటిస్తోంది. జగపతిబాబు, నాగబాబులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. చిత్ర టీజర్ ని స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలతో ఆగస్ట్ 15న విడుదల చేయబోతున్నారు.

2189
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles