100 కోట్ల మార్కును దాటిన అరవిందసమేత

Mon,October 15, 2018 01:18 PM
Aravinda sametha crosses 100 crore mark in world wide


ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన అరవింద సమేత చిత్రం బాక్సాపీస్ వద్ద తనదైన వసూళ్లతో విజయవంతంగా ప్రదర్శించబడుతుంది. ఈ సినిమా రెండు తెలుగు రాష్ర్టాలతోపాటు ఓవర్సీస్‌లోనూ మంచి కలెక్షన్లతో దూసుకెళ్తోంది. అక్టోబర్ 11న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 3 రోజుల్లోనే 100 కోట్ల మార్కును చేరుకుంది. తొలివారంలో అరవింద సమేత 100కోట్ల కలెక్షన్లను వసూలు చేసిందనిట్రేడ్ అనలిస్టు రమేశ్ బాలా ట్వీట్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా తొలిరోజే రూ.60 కోట్లు రాబట్టింది. అరవింద సమేత విమర్శకుల ప్రశంసలందుకుంటూ ఓవర్సీస్‌లోనూ భారీ కలెక్షన్లను వసూలు చేస్తున్నట్లు సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ తెలిపారు.

ఓవర్సీస్ కలెక్షన్ల వివరాలు..
యూఎస్ లో..
గురువారం-1,011,893 డాలర్లు (రూ.7,48, 64,903.60)
శుక్రవారం-2,75,325 డాలర్లు ( రూ.2,03,78,317.54)
శనివారం-357,658 డాలర్లు (రూ.2,64,72,235.70)
మొత్తం -(రూ.12.11) కోట్లు

ఆస్ట్రేలియాలో..
గురువారం-128,740 డాలర్లు
శుక్రవారం-69,666 డాలర్లు
శనివారం 57,574 డాలర్లు
మొత్తం- (1.3 కోట్లు)


2413
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS