అర‌వింద స‌మేత ఆడియో వేడుక‌కి టైం ఫిక్స్

Sat,September 8, 2018 01:07 PM
aravinda Sametha audio release time fixed

ఎన్టీఆర్ ప్ర‌ధాన పాత్ర‌లో త్రివిక్ర‌మ్ తెర‌కెక్కిస్తున్న చిత్రం అర‌వింద స‌మేత‌. అక్టోబ‌ర్ 11న విడుద‌ల కానున్న ఈ చిత్రం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుంది. ఎన్టీఆర్ తండ్రి హ‌రికృష్ణ మృతి కార‌ణంగా మూడు రోజులు షూటింగ్‌కి బ్రేక్ ఇచ్చిన ఎన్టీఆర్ త‌న వ‌ల‌న షూటింగ్ ఆల‌స్యం కాకూడ‌ద‌ని భావించి నాలుగో రోజు నుండే షూటింగ్‌లో పాల్గొన్నాడు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్‌లో ప్రత్యేకంగా వేసిన గుడి సెట్ లో జరుగుతుంది. ఈ సెట్లో చిత్ర బృందం ఫై ఫ్యామిలీ సాంగ్ ను చిత్రీకరిస్తున్నారు. ఎన్టీఆర్ కూడా చిత్రీక‌ర‌ణ‌లో పాల్గొన్నారు. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ చిత్తూర్ యాస లో మాట్లాడుతారట. త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే కథనాయికగా నటిస్తుంది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని హాసిని హారిక క్రియేషన్స్ నిర్మిస్తుంది . షూటింగ్‌తో పాటు డబ్బింగ్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరియు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ఏక కాలంలో పూర్తి చేస్తున్నారు.అయితే చిత్ర ఆడియో వేడుక‌ ఎప్పుడు జ‌రుగుతుందా అని అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తుండ‌గా, ఈ నెల 20వ తేదీన ఆడియో వేడుకను హైదరాబాద్ లోని 'నోవాటెల్' హోటల్లో నిర్వహించాలనే నిర్ణయానికి దర్శక నిర్మాతలు వచ్చినట్టుగా సమాచారం. సిరివెన్నెల , రామజోగయ్య శాస్త్రి అందించిన సాహిత్యానికి తమన్ అందించిన సంగీతం ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలవనుందని అంటున్నారు.

3794
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles