‘కాలా’లో అరవింద్ పేరు రజనీ సొంతపేరేనట

Mon,May 21, 2018 03:47 PM
Aravind akash as shivajirao gaekwad in kaala

చెన్నై: తమిళసూపర్‌స్టార్ రజినీకాంత్ తాజాగా కాలా చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. పా రంజిత్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రం ముంబై మురికివాడలో జరిగే పోరాటం నేపథ్యంలో కొనసాగుతుంది. ఈ సినిమాలో ప్రముఖ మలయాళ నటుడు అరవింద్ ఆకాశ్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నాడు. అయితే ఇప్పటివరకు ఏ నటుడికి రాని అవకాశం తనకు వచ్చినందుకు తెగ సంబరపడిపోతున్నాడు అరవింద్ ఆకాశ్. రజినీకాంత్ అసలు పేరు శివాజీ రావు గైక్వాడ్ అనేది తెలిసిన విషయమే. కాలాలో అరవింద్ ఆకాశ్ పాత్ర పేరు శివాజీ రావు గైక్వాడ్.

‘ఈ సినిమాలో నేను మరాఠీ పోలీసాఫీసర్‌గా కనిపిస్తా. ఇందులో నా పేరు రజనీ సార్ సొంత పేరు కావడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నా. ఇప్పటివరకు ఎవరికి రాని అరుదైన అవకాశం నాకు దక్కినందుకు హ్యాపీగా ఉందని’ అరవింద్ ఆకాశ్ తన సంతోషాన్ని అభిమానులతో షేర్ చేసుకున్నాడు. అరవింద్ ఆకాశ్ రజనీ ‘అరుణాచలం’ సినిమాతో బ్యాక్‌గ్రౌండ్ డ్యాన్సర్‌గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత నటుడిగా మారాడు.

1587
Follow us on : Facebook | Twitter
Namasthe Telangana Property Show

More News

VIRAL NEWS