అరకురోడ్‌లో పూరీ తమ్ముడు- వీడియో

Wed,September 14, 2016 10:25 AM
Araku Road Lo Movie THEATRICAL TRAILER

పూరి జగన్నాధ్‌ తమ్ముడిగా ఇండస్ట్రీకు ఎంట్రీ ఇచ్చిన సాయిరాం శంకర్‌ తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఈ సారి సరిక్రొత్తగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. మంచి టాలెంట్‌ ఉన్న కూడా సరైన సక్సెస్‌ దొరక్క ఇబ్బందిపడుతున్న సాయిరాం ఈ సారి మాత్రం ఫామ్‌ని అందుకునే ఊపులో ఉన్నట్టు అర్దమవుతోంది.సాయిరాం నటించిన లేటెస్ట్ చిత్రం రోమియో కాగా, ఈ చిత్రం 2014 లో విడుదలైంది. ఆ తర్వాత ఈ హీరో ఎలాంటి చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాకపోగా ప్రస్తుతం మూడు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నట్టు తెలుస్తోంది.

జగదాంబ, అరకురోడ్‌లో అనే సినిమాలు సెట్స్‌పై ఉండగా, వాడు నేను కాదు అనే టైటిల్‌తో ఓ చిత్రాన్ని పట్టాలెక్కించేందుకు సాయిరాం సిద్దంగా ఉన్నట్టు సమాచారం. ‘అరకురోడ్‌లో’ అనే చిత్రాన్ని వాసుదేవ్‌ తెరకెక్కిస్తుండగా, తాజాగా చిత్ర ట్రైలర్ ని విడుదల చేశారు. హీరో పెళ్ళి చూపులు వెళ్లడమే పనిగా పెట్టుకున్నట్టు ఈ ట్రైలర్ ద్వారా అర్ధమవుతుంది. ట్రైలర్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండగా మూవీ పై కూడా చాలా హోప్స్ పెరిగాయి. సాయిరాం సరసన నికిషా పటేల్ కథానాయికగా నటిస్తోండగా ఈ సినిమా థ్రిల్లర్‌ టచ్‌ ఇచ్చేలా కనిపిస్తోంది. మరి తాజాగా విడుదలైన ట్రైలర్ పై మీరు ఓ లుక్కేయండి.

1310
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles