‘అరకు రోడ్ లో’... ఏం జరిగింది?

Tue,August 9, 2016 12:31 PM
araku loyalo movie shooting completed

సాయిరాం శంకర్, నికీషా పటేల్ హీరో, హీరోయిన్లుగా శేషాద్రి క్రియేషన్స్ పతాకంపై వాసుదేవ్ తెరకెక్కించిన చిత్రం ‘అరకు రోడ్ లో’. మేకా బాలసుబ్రహ్మణ్యం, బి.భాస్కర్, వేగిరాజు ప్రసాద రాజు, రామేశ్వరి నక్కా లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు .. ఇటీవలే ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకోగా .. సెప్టెంబర్ మొదటి వారంలో ఆడియో విడుదల చేసి అదే నెలలో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు దర్శక నిర్మాతలు తెలియజేశారు. ఈ చిత్రం తప్పకుండా ఒక మంచి చిత్రంగా అందర్నీ ఆకట్టుకుంటుంది అని నిర్మాత అన్నారు. కమల్ కామరాజు, అభిమన్యు సింగ్, కోవై సరళ, థర్టీ ఇయర్స్ పృథ్వి, కృష్ణ భగవాన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం రాహుల్ రాజ్, వాసుదేవ్ లు అందించారు.3782
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles