మీటూపై ఏఆర్ రెహ్మాన్ షాకింగ్ కామెంట్‌

Tue,October 23, 2018 11:49 AM
AR Rahman on Me Too

ఇండియాలో మొద‌లైన మీటూ ఉద్య‌మం ఎంత‌టి తీవ్ర స్థాయికి చేరుకుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఒక్క రంగానికే కాకుండా అన్ని రంగాల‌లోను లైంగిక వేధింపులు జ‌రుగుతుండ‌డంతో సోష‌ల్ మీడియా ద్వారా బాధిత మ‌హిళ‌లు తమ గోడు విన్నవించుకుంటున్నారు. మీటూపై ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు ఏఆర్ రెహ్మాన్ తాజాగా ట్వీట్ చేశారు. మీటూ మూవ్‌మెంట్‌ని గ‌మ‌నిస్తూనే ఉన్నాను. కొందరి పేర్లను విని తాను చాలా షాక్‌కి గురయ్యానని రెహ్మాన్ వెల్లడించారు. క్లీన్‌, మహిళలను గౌరవించే ఇండస్ట్రీని నాకు చూడాలని ఉంది. మ‌హిళ‌లు తాము ఎదుర్కొన్న వేధింపులను బహిర్గ‌తం చేసేందుకు ముందుకు వస్తున్న మహిళలకు మరింత శక్తినివ్వాలి. మంచి వాతావరణాన్ని సృష్టించేందుకు మేమంతా కృషి చేస్తాం. బాధితులు తమ బాధను వ్యక్త పరిచేందుకు సోషల్ మీడియా మంచి ఫ్రీడమ్‌ని కల్పిస్తోంది. ఒకవేళ అది దుర్వినియోగమైతే.. మనం కొత్త ఇంటర్నెట్ జస్టిస్ సిస్టమ్‌ను క్రియేట్ చేయడంతో జాగ్రత్త వహించాలి’’ అని రెహ్మాన్ ట్వీట్ చేశారు.2828
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles