చిరుకి నై, బ‌న్నీకి సై

Wed,July 18, 2018 11:15 AM
ar rahman next with allu arjun

మ్యూజిక్‌ మాంత్రికుడు ఏఆర్ రెహ‌మాన్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం చేయ‌న‌క్క‌ర్లేదు. రెండు ఆస్కార్‌లు అందుకున్న ఈ సంగీత ద‌ర్శ‌కుడు అందించిన సంగీతానికి ప‌ర‌వ‌శించ‌ని వారుండ‌రు. ఎన్నో చిత్రాల‌కి అద్భుత‌ సంగీతం అందించిన ఏ ఆర్ రెహమాన్‌ని చిరు ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కుతున్న సైరాకి సంగీత ద‌ర్శ‌కుడిగా ఎంపిక చేశారు. ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కుతున్న ఈ ప్రాజెక్ట్‌కి బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో పాటు పాట‌లకి అద్భుత బాణీలు స‌మ‌కూర్చుతారని అంద‌రు భావించారు. కాని త‌న‌కున్న బిజీ షెడ్యూల్ వ‌ల‌న ఈ ప్రాజెక్ట్ నుండి త‌ప్పుకున్నాడు రెహ‌మాన్. అయితే బ‌న్నీ సినిమాకి సంగీతం అందించేందుకు ఈ మ్యూజిక్ మాంత్రికుడు సిద్ధంగా ఉన్న‌ట్టు స‌మాచారం.

ఇటీవ‌ల నా పేరు సూర్య‌.. నా ఇల్లు ఇండియా అనే చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన బ‌న్నీ, త్వ‌ర‌లో ద‌ర్శ‌కుడు విక్ర‌మ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌నున్నాడు. యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా రూపొంద‌నున్న ఈ సినిమాకి సంబంధించి ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. బారీ బ‌డ్జెట్‌తో ప్ర‌తిష్టాత్మ‌కంగా ఈ ప్రాజెక్ట్‌ని రూపొందించాల‌ని టీం భావిస్తుంది. సినిమాకి యాక్ష‌న్ సీన్స్ కీల‌కం కాబ‌ట్టి హాలీవుడ్ యాక్ష‌న్ కొరియోగ్రాఫ‌ర్‌ని ఈ ప్రాజెక్ట్‌కి ఎంపిక చేయ‌నున్న‌ట్టు స‌మాచారం. ఇక సంగీత ద‌ర్శ‌కుడిగా ఏఆర్ రెహ్మాన్ అయితే బాగుంటుందని దర్శక నిర్మాతలు భావిస్తున్నారట. ఆయ‌నతో సంప్ర‌దింపులు జరిపి ఒప్పించేలా ప్ర‌య‌త్నిస్తున్నారని ఇన్‌సైడ్ టాక్. రెహ‌మాన్ ఈ ప్రాజెక్ట్‌కి క‌నుక గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తే మూవీ స‌గం విజ‌యం సాధించిన‌ట్టేన‌ని అంటున్నారు.

3137
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles