ర‌జ‌నీకాంత్ త‌ర్వాతి ప్రాజెక్ట్‌పై వ‌చ్చిన క్లారిటీ

Tue,December 18, 2018 08:42 AM
AR Murugadoss to direct Rajinikanth in next year

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ యంగ్ హీరోల‌తో పోటీ ప‌డుతూ సినిమాలు చేస్తున్నాడు. ఆయ‌న న‌టించిన 2.0 చిత్రం ఇటీవ‌ల విడుద‌లై భారీ విజ‌యం సాధించింది. ఇక కార్తీక్ సుబ్బ‌రాజు ద‌ర్శ‌క‌త్వంలో ర‌జ‌నీకాంత్ హీరోగా రూపొందుతున్న పేటా చిత్రం సంక్రాంతి కానుక‌గా విడుద‌ల కానుంది. ఈ చిత్రానికి సంబంధించి విడుద‌లైన పోస్ట‌ర్స్‌, సాంగ్స్ ప్రేక్ష‌కుల‌లో ఆస‌క్తిని క‌లిగిస్తున్నాయి. ఇదిలా ఉంటే ర‌జ‌నీకాంత్ 166 వ చిత్రం మురుగ దాస్ ద‌ర్శ‌క‌త్వంలో ఉంటుంద‌ని కొన్నాళ్ల నుండి ప్ర‌చారం జ‌రుగుతుంది. దీనిపై మురుగ క్లారిటీ ఇచ్చారు.

విజ‌య్ ప్ర‌ధాన పాత్ర‌లో స‌ర్కార్ వంటి సూప‌ర్ హిట్ చిత్రాన్ని తెర‌కెక్కించిన మురుగదాస్ త‌న త‌ర్వాతి చిత్రాన్ని ర‌జ‌నీకాంత్‌తో చేయ‌నున్న‌ట్టు తెలిపారు. ఈ చిత్రం పొలిటిక‌ల్ బ్యాక్‌డ్రాప్‌లో కాకుండా మాస్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఉంటుంద‌ని అన్నారు. లైకా ప్రొడ‌క్ష‌న్స్ నిర్మించ‌నున్న ఈ చిత్రానికి అనిరుధ్ ర‌విచంద్ర‌న్ సంగీతం అందించ‌నున్నారు. పేటా రిలీజ్ త‌ర్వాత ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్ల‌నున్న‌ట్టు తెలుస్తుంది.

1645
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles