ఇక రూమ‌ర్స్ ఆపండ‌న్న మురుగ‌దాస్‌

Wed,October 31, 2018 08:19 AM

ద‌క్షిణాదిలో అత్యంత టాలెంట్ ఉన్న ద‌ర్శ‌కుల‌లో మురుగ‌దాస్ ఒక‌రు. ఆయ‌న తాజాగా తెర‌కెక్కించిన చిత్రం స‌ర్కార్. న‌వంబ‌ర్ 6న తెలుగు, త‌మిళ భాష‌ల‌లో విడుద‌ల కానున్న ఈ చిత్రం కొద్ది రోజులుగా వివాదాల‌లో మునిగి తేలుతుంది. ఈ సినిమా క‌థ‌ని కొన్ని సంవ‌త్స‌రాల క్రిత‌మే రిజిస్ట‌ర్ చేశానంటూ వ‌రుణ్ రాజేంద్ర‌న్ అనే వ్య‌క్తి కేసు వేశాడ‌ని, త‌నకు రూ.30లక్షల నగదు, టైటిల్స్‌లో స్టోరీ క్రెడిట్‌ ఇవ్వాలని డిమాండ్ చేశాడ‌ని ప‌లు పుకార్లు షికారు చేసాయి . అయితే ఈ వార్త‌ల‌పై తాజాగా మురుగ‌దాస్ త‌న ట్విట్ట‌ర్ ద్వారా క్లారిటీ ఇచ్చారు. నకిలీ ఓట్లు వేయించడమనేది ఎంత భయానక నేరమో తెలుపుతూ, ప్రజలకు ఓట్ల విషయంలో అవగాహన కల్పించాలనే ఈ ప్రాజెక్ట్ మొదలుపెట్టా. చాలా మందితో చర్చలు జరిపాక ‘సర్కార్’ రూపొందించాను. కాని మా క‌న్నా ముందు వ‌రుణ్ అనే స‌హాయ ద‌ర్శ‌కుడు ఈ క‌థ‌ని ఛాంబ‌ర్ లో రిజిస్ట‌ర్ చేసుకున్నాడు. అత‌నిని ఉత్సాహ‌ప‌ర‌చ‌డం కోసం టైటిల్స్‌లో అత‌ని పేరు వేస్తే బాగుంటుంద‌ని భాగ్య‌రాజా గారు చెప్ప‌డంతో ఒప్పుకున్నాను. అంతే .. ‘సర్కార్‌’ సినిమాకి కథ, స్క్రీన్‌ ప్లే, దర్శకత్వం అన్నీ నేనే. ఇందులో ఎలాంటి మార్పు లేదు అని ఏ ఆర్‌ మురుగదాస్ వివ‌ర‌ణ ఇస్తూ వీడియో పోస్ట్ చేశారు.



1562
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles