పుకార్లకు చెక్ పెట్టిన ప్రముఖ దర్శకుడు

Wed,January 16, 2019 08:12 PM
AR Murugadoss clears all rumours on his new project

మహేశ్ బాబుతో స్పైడర్, విజయ్ తో సర్కార్ సినిమాలను తీశాడు ప్రముఖ దర్శకుడు ఏఆర్ మురుగదాస్. ఈ చిత్రాల తర్వాత మురుగదాస్ కొత్త సినిమా ఏంటనే దానిపై అభిమానులు ఆసక్తిగా ఎదురుచూశారు. అయితే సంక్రాంతి సందర్భంగా మురుగదాస్ తన కొత్త మూవీ టైటిల్ ను ప్రకటించినట్లు ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది.

మురుగదాస్ కొత్త చిత్రం పేరు 'నార్కాలి' అని వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై అభిమానులకు ట్విట్టర్ లో స్పష్టత ఇచ్చాడు మురుగదాస్. 'నార్కాలి' నా కొత్త సినిమా టైటిల్ కాదు. పుకార్లు సృష్టించడం ఆపేయండని ట్వీట్ చేశాడు. మురుగదాస్ తన కొత్త ప్రాజెక్టును స్టార్ హీరోతో తీసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. దీనిపై ఎలాంటి అధికారిక సమాచారం లేదు. మరి మురుగదాస్ కొత్త సినిమా ఎవరితో తీస్తాడు..ఎపుడు సెట్స్ పైకి వెళ్తుంది అనే విషయాలు తెలియాలంటే..ఆయన నుంచి ఓ ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే.


4918
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles