‘ఆక్వామన్‌’ నుండి స్ట‌న్నింగ్ వీడియో విడుద‌ల‌

Sat,January 12, 2019 07:52 AM
AQUAMAN Visual Effects  Before & After

మనుషుల ఫాంటసీలను వెండితెరపై అద్భుతంగా చూపించ‌డంలో హాలీవుడ్ ద‌ర్శ‌కులు దిట్ట‌. సూపర్ మ్యాన్.. స్పైడర్ మ్యాన్.. బ్యాట్ మ్యాన్.. ఇలా ఎన్నో విచిత్రమైన పాత్రలతో సినీ ప్రియుల్ని ఉర్రూతలూగించారు హాలీవుడ్ ఫిలిం మేకర్స్. తాజాగా ‘ఆక్వామ్యాన్’ అనే చిత్రాన్ని తెరపైకి తీసుకు వ‌చ్చారు. సగం మనిషిగా.. సగం చేపగా ఉండే చిత్రమైన క్యారెక్టర్ నేప‌థ్యంలో ఈ మూవీ న‌డుస్తుంది. ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌లైన ఈ చిత్రం దాదాపు 7 వేల కోట్ల‌కి పైగా వ‌సూళ్ళు రాబ‌ట్టింది. ఇంతకుముందు ‘సూపర్ మ్యాన్ వెర్సస్ బ్యాట్ మ్యాన్’.. ‘డాన్ ఆఫ్ జస్టిస్’.. ‘జస్టిస్ లీగ్’ లాంటి సినిమాల్లో ముఖ్య పాత్రలు పోషించిన జేసన్ మొమోవా ఇందులో ఆక్వామన్ పాత్రలో కనిపించాడు. జేమ్స్‌ వాన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అంబర్‌ హియర్డ్‌‌‌, ప్యాట్రిక్‌ విల్సన్‌ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. వార్నర్‌ బ్రదర్స్‌, డీసీ ఫిల్మ్స్‌ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించాయి. ఏడు రాజ్యాల మధ్య జరిగే యుద్ధాన్ని ఈ సినిమాలో ఉత్కంఠ భరితంగా చూపించారు. తాజాగా ‘ఆక్వామెన్‌: విజువల్‌ ఎఫెక్ట్స్‌ బిఫోర్‌, ఆఫ్టర్‌’ పేరుతో చిత్ర బృందం ఓ వీడియోను విడుదల చేసింది. ఇందులోని స‌న్నివేశాలు ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటున్నాయి. మీరు వీడియోపై ఓ లుక్కేయండి.

1417
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles