యాపిల్ బ్యూటీ ఫుల్ వీడియో సాంగ్

Sat,October 1, 2016 08:06 AM
Apple Beauty Full Video Song

తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో విడుదలైన జనతా గ్యారేజ్ ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ కలెక్షన్స్‌లో కొత్త రికార్డ్‌ని సృష్టించడమే కాదు...మొదటి 10 రోజుల షేర్ లోనూ ముందుకు దూసుకుపోయింది. 12-13 ఏళ్ళుగా పడిన తన తపనకు ఈ సినిమా మంచి ఫలితాన్ని ఇచ్చిందని జూనియర్ ఎన్టీఆర్ అన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని అంత పెద్ద హిట్ చేసినందుకు ఇప్పటికే థ్యాంక్స్ మీట్ పెట్టి ఫ్యాన్స్ కు కృతజ్ఞతలు తెలిపారు చిత్ర బృందం. ఇక సక్సెస్ వేడుకని కూడా గ్రాండ్ గా నిర్వహించారు. కొరటాల దర్శకత్వం, మోహన్ లాల్ సపోర్టింగ్ రోల్ , సమంత, నిత్యామీనన్ ల గ్లామర్ సినిమాకు మంచి హైప్ తెచ్చాయి. ఇక దేవి శ్రీ అందించిన సంగీతం , బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ లవర్స్ ని ఎంతగానో అలరించాయి. తాజాగా యాపిల్ బ్యూటీ ఫుల్ వీడియో సాంగ్ ని విడుదల చేసింది చిత్ర యూనిట్. మరి ఆ వీడియోపై మీరు ఓ లుక్కేయండి.

2017
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles