భానుమతి రోల్ లో అనుష్క..?

Sun,February 18, 2018 05:25 PM
భానుమతి రోల్ లో అనుష్క..?


హైదరాబాద్ : అలనాటి అందాల నటి సావిత్రి జీవితాధారంగా ‘మహానటి’ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో కీర్తి సురేశ్‌ లీడ్ రోల్ లో నటిస్తుండగా..సమంత జర్నలిస్ట్‌ పాత్ర లో కనిపించనుంది. నాగ్‌ అశ్విన్‌ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా గురించి ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతున్నది. ఈ మూవీలో అలనాటి నటి భానుమతి పాత్రలో టాలీవుడ్ బ్యూటీ అనుష్క నటిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.

తెలుగు చిత్ర పరిశ్రమలో అత్యధిక సినిమాలు చేసిన వారిలో భానుమతి కూడా ఉన్నారు. అయితే ఆమె రోల్ కు అనుష్క అయితే పక్కాగా షూట్ అవుతుందని భావించిన టీం..అనుష్కను ఫైనల్ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై అనుష్క నుంచి మాత్రం ఎలాంటి కామెంట్ రాలేదు. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఈ మూవీలో మోహన్‌బాబు, ప్రకాశ్‌ రాజ్, దుల్కర్‌ సల్మాన్, విజయ్‌ దేవరకొండ, విక్రమ్‌ ప్రభు, షాలిని పాండే ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తు్న్నారు.

2583

More News

VIRAL NEWS