అనుష్క డబ్బింగ్ చెప్పకపోవడానికి కారణం ?

Thu,February 8, 2018 03:38 PM
Anushka Shetty voice not fit for particular  roles

ఏ పాత్రలోనైన నటించి మెప్పించే నటి అనుష్క. ఆమె చిత్రసీమకొచ్చి పదేళ్ల పైనే అయినా ఇంకా తన అందచందాలతో అలరిస్తూనే ఉంది. అలాగే కొన్ని పాత్రల్లో మరచిపోలేని నటననూ ప్రదర్శించింది. బాహుబలితో అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకున్న అనుష్క తాజాగా భాగమతి చిత్రంతో అలరించింది . ఈ అమ్మడు నటన పరంగా ఆకట్టుకుంటున్నప్పటికి, తన పాత్రకి తాను డబ్బింగ్ చెప్పుకోకపోవడం అందరిని ఆశ్చర్యపరుస్తుంది. మొన్న మొన్న వచ్చిన సాయిపల్లవి, అనుపమ, కీర్తి సురేష్, అనూ ఇమ్మానుయేల్ వంటి హీరోయిన్లు తెలుగు చక్కగా మట్లాడతారు. వారి పాత్రలకి డబ్బింగ్ కూడా చెప్పుకుంటున్నారు. మరి అనుష్క ఎందుకు డబ్బింగ్ చెప్పడం లేదనే ప్రశ్న అందరి మదిలో మెదులుతూ ఉంది. దీనిపై తాజాగా క్లారిటీ ఇచ్చింది అనుష్క. నా గొంతు చిన్నపిల్లల మాదిరిగా ఉంటుంది. నేను మాట్లాడితే ఒక్కోసారి పక్కన వ్యక్తికే వినిపించదని ఇది వరకు మా కుటుంబసభ్యులు ఎన్నో సార్లు నాతో అన్నారు. ఏపాత్రకయినా గాత్రమే ప్రధానం. అలాంటప్పుడు నేను డబ్బింగ్ చెప్పి పాత్ర ప్రాధాన్యాన్ని దెబ్బతీయలేను. అరుంధతి చిత్రంలో నువ్వు నన్నేం చేయలేవురా అనే డైలాగ్, భాగమతి లో ఇది భాగమతి అడ్డా .. వీటికి గాత్రంలో గాంభీర్యం ప్రదర్శించాలి. దీనికి నా గొంతు ఏ మాత్రం సరిపోదు. అందుకే ఇన్నాళ్ళు డబ్బింగ్కి దూరంగా ఉన్నానంటూ చెప్పుకొచ్చింది అనుష్క. భాగమతి సినిమాని ఇంత పెద్ద హిట్ చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది స్వీటి.

1732
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles