అమెరికాకి ప‌య‌న‌మ‌వుతున్న అనుష్క‌..!

Thu,May 16, 2019 10:16 AM

భాగ‌మ‌తి చిత్రం త‌ర్వాత చాలా గ్యాప్ తీసుకున్న అనుష్క హేమంత్ మ‌ధుక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో సైలెన్స్ అనే చిత్రం చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. తమిళం, తెలుగు, హిందీ భాష‌ల‌లో తెర‌కెక్క‌నున్న ఈ చిత్రంలో మాధవన్‌ హీరోగా న‌టించ‌నుండ‌గా, అంజలి, షాలినిపాండే ప్రధాన పాత్రల్లో నటించనున్నారు. ఇది సస్పెన్స్, థ్రిల్లర్‌ కథాంశంతో రూపొందనుందని సమాచారం. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, కోన ఫిలిం కార్పొరేష‌న్ సంస్థ‌తో క‌లిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. హాలీవుడ్ రేంజ్‌లో ఈ మూవీ తెర‌కెక్క‌నుంద‌ని తెలుస్తుండ‌గా, ఈ ప్రాజెక్ట్‌ని ఫిబ్ర‌వరిలోనే సెట్స్‌పైకి తీసుకెళ్ళాల‌ని అనుకున్నారు. కాని అనుష్క‌కి వీసా రావడం ఆల‌స్యం కావ‌డంతో వాయిదా వేశారు.


సైలెన్స్ మూవీ చిత్రీక‌ర‌ణ అధిక భాగం అమెరికాలో జ‌ర‌పాల‌ని టీం భావించింది. అయితే చిత్రంలో ప్ర‌ధాన పాత్ర పోషిస్తున్న అనుష్క వీసా విష‌యంలో జాప్యం జ‌రిగింది. దీంతో షెడ్యూల్ వాయిదా ప‌డింది. ఇప్ప‌డు అనుష్క‌కి వీసా రావ‌డంతో టీం అమెరికాకి బ‌యలుదేరేందుకు సిద్ద‌మైంద‌ట‌. ఈ ఏడాదే సెలెన్స్ చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తెచ్చే ఆలోచ‌న‌లో టీం ఉంద‌ట‌. కిల్ బుల్ ఫేం మేఖేల్ మ్యాడ‌స‌న్ చిత్రంలో కీల‌క పాత్ర పోషించ‌నున్నారు. రెండు అనే చిత్రంలో నటుడు మాధవన్‌కు జంటగా తొలిసారిగా న‌టించిన అనుష్క ఇప్పుడు ఆయ‌న‌తో రెండో సారి జ‌త కడుతుంది. ఈ చిత్రంలో అనుష్క క్యూట్ లుక్‌లో క‌నిపించ‌నున్నారు. అనుష్క సైరా చిత్రంతో పాటు ఆర్ఆర్ఆర్ చిత్రంలోను ముఖ్య పాత్ర‌లు పోషిస్తున్న‌ట్టు ఇటీవ‌ల వార్త‌లు వ‌చ్చిన విష‌యం తెలిసిందే.

3211
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles