సాహో పోస్ట‌ర్‌పై స్పందించిన స్వీటీ

Wed,May 22, 2019 08:44 AM
Anushka Shetty comment on saaho poster

ప్ర‌భాస్, అనుష్క వీరిద్ద‌రు వెండితెర‌పై సంద‌డి చేస్తే అభిమానుల‌కి క‌న్నుల పండుగ‌గా ఉంటుంది. వీరిద్ద‌రిని రీల్ లైఫ్‌లో ఎంత‌గానో ఇష్ట‌ప‌డ్డ అభిమానులు రియ‌ల్ లైఫ్‌లో జంట‌గా చూడాల‌ని క‌ల‌లు కంటున్నారు. కాని తామిద్ద‌రిది స్నేహం మాత్ర‌మే ప‌లుమార్లు ఈ జంట పుకార్ల‌పై క్లారిటీ ఇచ్చింది. క‌ట్ చేస్తే ప్ర‌భాస్ ప్ర‌స్తుతం సాహో చిత్రంతో బిజీగా ఉండ‌గా, ఈ సినిమాకి సంబంధించిన పోస్ట‌ర్‌ని త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు ప్ర‌భాస్‌. కొద్ది క్ష‌ణాల‌లో ఈ పోస్ట‌ర్ వైర‌ల్ అవ్వ‌డ‌మే కాక ప్ర‌తిఒక్క‌రిని ఎంత‌గానో ఆక‌ట్టుకుంది. ప‌లువురు సెల‌బ్రిటీలు కూడా ఈ పోస్ట‌ర్‌పై ప్ర‌శంస‌లు కురిపించారు. ఈ క్ర‌మంలో అనుష్క త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో సాహో పోస్ట‌ర్‌ని షేర్ చేస్తూ.. ఈ సినిమా నుండి వ‌స్తున్న ప్ర‌తి అంశం చాలా అద్భుతంగా ఉంటుంది. త‌ర్వాత ఏంటి అనే ఆస‌క్తిని క‌లిగిస్తుంది. సినిమాపై కూడా భారీ అంచ‌నాలు పెంచుతుంది. ఆగ‌స్ట్ 15న విడుద‌ల కానున్న సాహో చిత్రం కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నాను. ప్రభాస్‌, యూవీ క్రియేషన్స్‌, సుజిత్‌తో పాటు చిత్ర బృందంలోని ప్రతి ఒక్క టెక్నీషియన్‌కు ఆల్‌ ది బెస్ట్ అని స్వీటీ కామెంట్‌లో తెలిపారు. అనుష్క ప్ర‌స్తుతం సైలెన్స్ అనే చిత్రంతో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. హేమంత్ మధుకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో.. మాధవన్‌, అంజలి, షాలినీ పాండే, సుబ్బరాజు, అవసరాల శ్రీనివాస్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు

1976
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles