ఫ్యాన్స్‌తో ఓ ఆటాడుకున్న అనుష్క‌

Sat,December 1, 2018 10:04 AM
Anushka Sharma Plays Hilarious Prank on Her Fans

బాలీవుడ్ బ్యూటీ అనుష్క శ‌ర్మ అభిమానుల గుండెల్లో గుబులు పుట్టించేసింది. ఇటీవ‌ల అనుష్క శ‌ర్మ మైన‌పు విగ్ర‌హం సింగపూర్‌లోని ప్రముఖ మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియంలో ఆవిష్క‌రించిన సంగతి తెలిసిందే. ఇది ఇంట‌రాక్టివ్ మైన‌పు విగ్ర‌హం కాగా, ఇలాంటి విగ్ర‌హం ఉన్న ఏకైక భారతీయ సెల‌బ్రిటీ అనుష్క‌నే. త‌న విగ్ర‌హాన్ని చూసుకున్న అనుష్క ఎంత‌గానో మురిసిపోయింది. అయితే త‌న విగ్ర‌హాం మాదిరిగా అనుష్క చేతిలో ఫోన్ ప‌ట్టుకొని సెల్ఫీ దిగుతున్న‌ట్టు మైన‌పు బొమ్మ‌ల ప‌క్క‌న నిలుచున్నారు. మ్యూజియంలో విగ్ర‌హాలు చూసేందుకు వ‌చ్చిన ఫ్యాన్స్ అనుష్క‌తో సెల్ఫీ దిగేందుకు విగ్ర‌హం ప‌క్క‌న నిల‌బ‌డ్డారు. అప్పుడు ఆమె గ‌ట్టిగా అర‌వ‌డంతో ఒక్క‌సారిగా ఉలిక్కిప‌డ్డారు. మొత్తానికి బొమ్మ‌లా నిలుచున్న అనుష్క త‌న చేష్ట‌ల‌తో అభిమానుల‌ని హ‌డ‌లెత్తించేసింది. ఈ సన్నివేశాల‌కి సంబంధించిన వీడియోని మ్యూజియం సిబ్బంది రహస్యంగా వీడియో తీసి, ఈ వీడియోను ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశారు. దాంతో ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. అనుష్క న‌టించిన జీరో చిత్రం డిసెంబ‌ర్ 21న ప్రేక్ష‌కుల ముందుకు రానున్న సంగ‌తి తెలిసిందే.

1920
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles