నాలా ఉన్న‌ మ‌రో ఐదుగురి కోసం వెతకాలి : అనుష్క శ‌ర్మ‌

Wed,February 6, 2019 12:41 PM
Anushka Sharma funny replies to american singer

మ‌నుషుల‌ని పోలిన మ‌నుషులు ఏడుగురు ఉంటార‌నే సంగ‌తి మ‌నంద‌రికి తెలిసిందే. సోష‌ల్ మీడియా వ‌ల‌న ఒకే పోలిక‌తో ఉన్న వ్య‌క్తులు ఏ దేశంలో ఉన్నా ఇట్టే తెలిసిపోతుంది. గ‌తంలో ప‌లు సంద‌ర్భాల‌లో ప‌లువురి సెలబ్రిటీల పోలిక‌తో ఉన్న వ్య‌క్తుల‌ని సోష‌ల్ మీడియా ద్వారా మ‌న నెటిజ‌న్స్ ప‌సిగ‌ట్టేశారు. స‌ల్మాన్, అజయ్‌ దేవగణ్‌, సైఫ్‌ అలీ ఖాన్, ప్రియాంక చోప్రా, ఆలియా భట్‌లని పోలీ ఉన్నవారి ఫోటోలు కూడా అప్ప‌ట్లో వైర‌ల్ అయ్యాయి. తాజాగా బాలీవుడ్ నటి అనుష్క శ‌ర్మని పోలి ఉన్న అమెరికన్‌ గాయని జులియా మైకెల్స్ ఫోటోలు నెటిజన్స్‌ని ఆక‌ట్టుకున్నాయి.

ఇటీవ‌ల ఓ ట్విట్ట‌ర్ యూజ‌ర్ అనుష్క శ‌ర్మ‌.. జులియాలా ఉందని ఆమె ఫోటోను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేస్తూ.. అనుష్క శర్మను ట్యాగ్ చేసింది. దీంతో వీరిద్ద‌రికి సంబంధించిన ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి. వారిద్ద‌రు క‌వ‌ల‌లా అంటూ చర్చ‌లు కూడా చేశారు. ఈ క్ర‌మంలో జులియా మైకెల్స్ త‌న ట్విటర్‌లో వారిద్ద‌రు క‌లిసి ఉన్న ఫొటోను పోస్ట్‌ చేస్తూ.. ‘హాయ్‌ అనుష్క.. మనమిద్దరం కవలలమట..’ అని ఫ‌న్‌గా ట్వీట్ చేసింది.

దీనిపై అనుష్క కూడా స్పందించింది. ఓ మైడ్ గాడ్ అవును ! నువ్వు కనిపించావు కాబ‌ట్టి, నాలా ఉన్న మ‌రో ఐదుగురి కోసం వెతకాలి అంటూ స‌ర‌దాగా రిప్లై ఇచ్చింది. ప్ర‌స్తుతం వీరిద్ద‌రి మ‌ధ్య జ‌రిగిన సంభాష‌ణ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది. అనుష్క శ‌ర్మ ప్ర‌స్తుతం తన భ‌ర్త విరాట్ కోహ్లీతో క‌లిసి హాలిడే ట్రిప్ ఎంజాయ్ చేస్తుంది. చివ‌రిగా జీరో అనే చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన అనుష్క ప్రస్తుతం ప‌లు క్రేజీ ప్రాజెక్ట్ చేస్తుంది.


2148
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles