ప్ర‌భాస్‌ని అన్న‌య్య అని పిల‌వలేనంటున్న అనుష్క‌

Thu,January 18, 2018 05:53 PM
anushka says intresting points about prabhas

గ్లామ‌ర్ పాత్ర‌ల‌లోనే కాక డీ గ్లామ‌ర‌స్ రోల్స్‌లోను అద్భుతంగా న‌టిస్తూ అశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందిన న‌టి అనుష్క‌. ఈ అమ్మ‌డి తాజా చిత్రం భాగ‌మ‌తి జ‌న‌వ‌రి 26న విడుద‌ల కానుండ‌గా, నిన్న సాయంత్రం త‌మిళ‌నాడులో ఆడియో వేడుక జ‌రుపుకుంది. ఈ కార్య‌క్ర‌మంలో అనుష్క త‌న కెరీర్ గురించి మాట్లాడుతూనే త‌న క్లోజ్ ఫ్రెండ్ ప్ర‌భాస్‌ని అన్న‌య్య అన‌లేన‌ని చెప్పింది. అబ్బాయిలందర్ని మనం అన్నయ్య అని అనుకోలేము కదా అలాగే ప్రభాస్ ని కూడా అలా అనుకోను. మా మధ్య ఒక మంచి స్నేహం ఉందని వివ‌రించింది అనుష్క . ఇక త‌న పెళ్లికి సంబంధించి వ‌చ్చిన రూమర్స్‌పై కూడా చ‌క్కగా మాట్లాడింది స్వీటీ. రూమ‌ర్స్ వ‌ల్ల నా పెళ్లి గురించి ఆలోచించడమే మనేశాను. మీరే ఒక మంచి అబ్బాయిని చూడండి అని చెప్పడంతో స్వీటీ మాటలకు ప్ర‌తి ఒక్క‌రు ఆడిటోరియం ద‌ద్ద‌రిల్లేలా అరిచారు. భాగ‌మ‌తి సినిమా చేయడానికి ముఖ్య కారణం యూవీ క్రియేషన్స్ అండ్ పర్ఫెక్ట్ స్క్రిప్ట్ అని దర్శకుడు సినిమాను చాలా బాగా తెరకెక్కించాడని తెలిపింది అనుష్క‌. సంచల అనే ఐఏఎస్ అధికారి పాత్రలో తను కనిపించ‌నున్న‌ట్టు తెలిపింది యోగా బ్యూటీ. రాజ‌మౌళితో మ‌రో సినిమా చేయాల‌ని ఉంద‌నే కోరిక వెళ్ళ‌బుచ్చిన అనుష్క త్వ‌ర‌లో గౌత‌మ్ మీన‌న్‌తో ఓ ప్రాజెక్ట్ చేయ‌నుంద‌ట‌. బాహుబ‌లి, రుద్ర‌మదేవి వంటి భారీ చిత్రాల‌తో మెప్పించిన‌ అనుష్క తాజాగా భాగ‌మ‌తి చిత్రంతో మ‌రోసారి అల‌రిస్తానంటుంది. పిల్ల జమీందార్ ఫేం జి. అశోక్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీలో ఉన్ని ముకుందన్‌, జయరాం, మురళీ శర్మ ప్రధాన పాత్రలు పోషించారు. తమన్‌ స్వరాలు సమకూర్చిన సంగ‌తి తెలిసిందే.

3652
Follow us on : Facebook | Twitter
Namasthe Telangana Property Show

More News

VIRAL NEWS

Namasthe Telangana Property Show

Featured Articles