మ‌రోసారి వెండితెర‌పై ప్ర‌భాస్-అనుష్క కాంబినేష‌న్‌

Sat,December 15, 2018 11:15 AM
anushka prabhas combination comes again

ప్ర‌భాస్- అనుష్క.. ఈ కాంబినేష‌న్ పేరు వింటే అభిమానుల ఆనందం పీక్ స్టేజ్‌కి వెళుతుంది. మిర్చి, బిల్లా,బాహుబ‌లి చిత్రాల‌లో క‌లిసి న‌టించిన వీరిద్ద‌రు రియ‌ల్ లైఫ్‌లో భార్య భ‌ర్త‌లుగా మార‌నున్నార‌ని ఆ మధ్య జోరుగా ప్ర‌చారం జ‌రిగింది. ఈ వార్త‌ల‌ని అనుష్క ప‌లు మార్లు ఖండించింది. అయితే ఈ జంట‌ని క‌నీసం వెండితెర‌పై అయిన మ‌రోసారి చూడాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఈ నేప‌థ్యంలో అనుష్క- ప్ర‌భాస్‌లు జిల్ ఫేమ్ రాధాకృష్ణ తెర‌కెక్కిస్తున్న చిత్రంలో న‌టించ‌నున్నార‌నే టాక్ బ‌య‌ట‌కి వ‌చ్చింది. రాధాకృష్ణ తెర‌కెక్కిస్తున్న చిత్రం రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతుండగా, ఇందులో పూజా హెగ్డే క‌థానాయిక‌గా న‌టిస్తుంది. సినిమాలో కీల‌క పాత్ర కోసం మ‌రో హీరోయిన్ కావ‌ల‌సి ఉంద‌ట‌. ఆ పాత్ర కోస‌మే అనుష్కని తీసుకోవాల‌ని టీం భావిస్తుంద‌ట‌. చిత్రంలో ప్రభాస్ .. అనుష్కలపై కీలకమైన సన్నివేశాలతో పాటు ఒక బ్యూటిఫుల్ సాంగ్ కూడా ఉంటుందని అంటున్నారు. మ‌రి ఈ వార్తే నిజ‌మైతే అభిమానుల ఆనందానికి అడ్డుక‌ట్ట వేయ‌లేం.

3618
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles