ఎన్నారై పాత్ర‌లో స్వీటీ..!

Fri,February 22, 2019 09:13 AM
anushka plays nri look in silence

కెరీర్‌లో విభిన్న క‌థా చిత్రాలు చేస్తూ ప్రేక్ష‌కుల‌ని మెప్పిస్తున్న అనుష్క చాలా గ్యాప్ త‌ర్వాత ఓ సస్పెన్స్ థ్రిల్ల‌ర్ చేసేందుకు సిద్ధ‌మైంది. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో తెర‌కెక్క‌నున్న ఈ సినిమాని కోన ఫిల్మ్ కార్పొరేషన్ .. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మించ‌నున్నాయి. తెలుగుతో పాటు తమిళంలోను ఈ చిత్రం విడుద‌ల కానుంది. సైలెన్స్ అనే టైటిల్‌తో ప్ర‌చారం జ‌రుపుకుంటున్న ఈ చిత్రంలో అనుష్క‌తో పాటు మైఖేల్ మాడిసన్ అనే హాలీవుడ్ నటుడు, అంజ‌లి, షాలిని పాండే, సుబ్బ‌రాజు, మాధ‌వ‌న్ కీల‌క పాత్ర‌లు పోషించ‌నున్నారు. తాజాగా చిత్రానికి సంబంధించిన ఓ వార్త సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుంది.మూవీలో అనుష్క ఎన్నారై యువతిగా క‌నిపిస్తే, అంజ‌లి ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ గా కనిపిస్తారట. అతి త్వ‌ర‌లోనే ప్రాజెక్ట్‌కి సంబంధించిన పూర్తి విష‌యాల‌ని వెల్లడించ‌నున్నారు. మార్చి నుండి ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్ళ‌నుంది. గోపి సుంద‌ర్ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. సైజ్ జీరో త‌ర్వాత అనుష్క న‌టించిన అన్ని చిత్రాల‌లో ఆమె బొద్దుగా క‌నిపించింది. ఇప్పుడు సైలెన్స్‌లో మాత్రం సరికొత్త లుక్‌లో ఫ్యాన్స్‌కి మాంచి కిక్ ఇస్తుంద‌ని అంటున్నారు.

983
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles