ఎన్టీఆర్‌లో అనుష్క ఎవ‌రి పాత్ర పోషిస్తుందో తెలుసా ?

Wed,November 7, 2018 08:27 AM
anushka play key role in ntr

విశ్వ విఖ్యాత న‌టసార్వ‌భౌమ నంద‌మూరి తార‌క‌రామారావు జీవిత నేప‌థ్యంలో ద‌ర్శ‌కుడు క్రిష్ ఎన్టీఆర్ అనే సినిమా తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. రెండు పార్ట్‌లుగా రానున్న ఈ చిత్రం జనవరి 9న ‘యన్.టి.ఆర్-కథానాయకుడు’, జనవరి 24న ‘యన్.టి.ఆర్- మహానాయకుడు’గా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి సంబంధించిన వ‌స్తున్న వార్త‌లు ప్రేక్ష‌కుల‌కి అమితానందాన్ని క‌లిగిస్తుంది. ఇప్ప‌టికే ఎన్టీఆర్ సినిమాలోని ముఖ్య పాత్ర‌ల కోసం పలువురు స్టార్స్‌ని ఎంపిక చేసిన చిత్ర బృందం అనుష్క శెట్టిని కూడా కీల‌క పాత్ర కోసం సెల‌క్ట్ చేశార‌ట‌. యన్.టి.ఆర్ సరసన బి. సరోజాదేవి చాలా చిత్రాల్లో కలిసి నటించారు. అందులో చాలా వరకు సూపర్ హిట్ చిత్రాలుగా నిలిచాయి. ఆ చిత్రాలకు సంబంధించిన కొన్ని విషయాలను ఈ బయోపిక్‌లో చూపిస్తున్నారట.ఈ క్ర‌మంలో స‌రోజా దేవి పాత్ర కోసం అనుష్క‌ని తీసుకున్నార‌ట‌. అతి త్వ‌ర‌లో ఈ విష‌యాన్ని అధికారికంగా ధృవీక‌రించ‌నున్నార‌ని అంటున్నారు. అనుష్క చివ‌రిగా భాగ‌మ‌తి చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు రాగా, ఆ మూవీ త‌ర్వాత ఏ సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌క‌పోవ‌డం విశేషం. మ‌రి ఎన్టీఆర్‌తో అనుష్క ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రిస్తుంద‌ని వ‌స్తున్న వార్త‌ల‌లో నిజ‌మెంత ఉంద‌నేది తెలియాల్సి ఉంది.

5489
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles