అనుష్క "నిశ్శ‌బ్ధం" టీజ‌ర్ విడుద‌ల‌

Wed,November 6, 2019 06:10 PM

అనుష్క న‌టిస్తున్న తాజా చిత్రం సైలెన్స్‌. తెలుగులో ఈ చిత్రం నిశ‌బ్ధం పేరుతో విడుద‌ల కానుంది. హేమంత్ మ‌ధుక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ చిత్రం అమెరికాలో ఎక్కువ భాగం చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంది. తెలుగు, త‌మిళం, హిందీతో పాటు ప‌లు భాష‌ల‌లో ఈ చిత్రాన్ని విడుద‌ల చేసేందుకు మేక‌ర్స్ స‌న్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంలో మాధవన్‌ హీరోగా న‌టించ‌నుండ‌గా, అంజలి, షాలినిపాండే, అవ‌స‌రాల శ్రీనివాస్, సుబ్బ‌రాజు, హాలీవుడ్‌ స్టార్‌ మైఖెల్‌ మ్యాడసన్‌ ప్రధాన పాత్రల్లో నటించనున్నారు. ఇది సస్పెన్స్, థ్రిల్లర్‌ కథాంశంతో రూపొందనుందని సమాచారం. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, కోన ఫిలిం కార్పొరేష‌న్ సంస్థ‌తో క‌లిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. దీపావ‌ళి సంద‌ర్భంగా చిత్ర ప్రీ టీజ‌ర్ విడుద‌ల చేయ‌గా, నేడు నిశ్శ‌బ్ధం టీజ‌ర్‌ని విడుద‌ల చేయ‌నున్నారు. తెలుగులో పూరీ జ‌గ‌న్నాథ్‌, త‌మిళం, మ‌ల‌యాళంలో గౌత‌మ్ మీన‌న్, హిందీలో నీర‌జ్‌పాండే చిత్ర టీజ‌ర్‌ని విడుదల చేసారు

1057
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles