ప్ర‌భాస్ లాంటి అల్లుడు కావాలి,కాని ప్ర‌భాస్ కాదు: అనుష్క తల్లి

Fri,July 20, 2018 10:53 AM
anushka mother gives clarity on marriage of anushka prabhas

లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్న అందాల భామ అనుష్క‌. చివ‌రిగా భాగ‌మ‌తి అనే సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన అనుష్క త‌న త‌ర్వాతి ప్రాజెక్ట్ ఏంట‌నేది ఇంత‌వ‌ర‌కు ప్ర‌క‌టించ‌లేదు. అయితే ఆ మ‌ధ్య ప్ర‌భాస్‌తో అనుష్క పెళ్లి జ‌ర‌గ‌నుందంటూ ప‌లు వార్త‌లు వ‌చ్చాయి. బిల్లా, మిర్చి, బాహుబ‌లి సిరీస్‌ల‌లో జంట‌గా న‌టించిన ఈ హిట్ పెయిర్ రియ‌ల్ లైఫ్‌లో ఒక్క‌టి కానున్నారంటూ పుకార్లు షికారు చేశాయి. ఈ వార్త‌ల‌పై ఓ సారి కృష్ణం రాజు కూడా స్పందించారు. అలాంటిదేమి లేద‌ని అన్నారు. తాజాగా అనుష్క త‌ల్లి కూడా వ‌దంతుల‌పై క్లారిటీ ఇచ్చారు.

ప్ర‌భాస్‌, అనుష్క‌లు కేవ‌లం స్నేహితులు మాత్ర‌మే. స్క్రీన్‌పైన ఇద్ద‌రు మంచి జోడీగా ప్రేక్ష‌కుల మ‌న‌సులు గెలుచుకున్నారు. ప్ర‌భాస్ లాంటి మిస్ట‌ర్ ప‌ర్‌ఫెక్ట్ మాకు అల్లుడుగా వ‌స్తారు త‌ప్ప ప్ర‌భాస్ కాదు. సినిమాలు క‌లిసి చేస్తుండడంతో వారిపై రూమర్స్ ఎక్కువ‌తున్నాయి. వారి మ‌ధ్య స్నేహం త‌ప్ప ఇంకోటి ఏమి లేదు. ఇప్పటికైన త‌ప్పుడు ప్ర‌చారాలు చేయ‌డం ఆపేస్తార‌ని భావిస్తున్నాను అంటూ అనుష్క త‌ల్లి స్ప‌ష్టం చేశారు. గ‌తంలో అనుష్క కూడా వ‌దంత‌లుకి చెక్ పెట్టే ప్ర‌య‌త్నాలు చాలానే చేసింది. దయచేసి రియల్ లైఫ్‌లో బాహుబలి, దేవసేన కెమిస్ట్రీని ఎక్స్‌పెక్ట్ చెయ్యొద్దు అంటూ కోరిన సంగ‌తి తెలిసిందే.

3239
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS