కొత్త లుక్ లో మెరుస్తున్న అనుష్క..ఫొటోలు వైరల్

Mon,February 11, 2019 07:08 PM
Anushka looking gorgeous in latest photoshoot

సూపర్ సినిమాతో చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టి..ఆ తర్వాత ఎన్నో హిట్ చిత్రాల్లో నటించింది బెంగళూరు బ్యూటీ అనుష్క. ప్రయోగాలు చేయడంలో అందరు హీరోయిన్ల కన్నా ముందుండే స్వీటీ..'సైజ్ జీరో' సినిమా కోసం రిస్క్ తీసుకుని మరీ బరువు పెరిగింది. మరోవైపు బాహుబలి చిత్రంలో దేవసేన పాత్ర కోసం కూడా తీవ్రంగానే శ్రమించింది.

గతేడాది భాగమతిగా ప్రేక్షకుల ముందుకొచ్చిన అనుష్క..మళ్లీ పాత లుక్ తో అభిమానులను మెస్మరైజ్ చేస్తోంది. జీరో సైజ్ కోసం బరువు తగ్గేందుకు తీవ్రంగా శ్రమించిన తర్వాత అనుష్క ఫొటోషూట్ లో పాల్గొంది. తాజా ఫొటోషూట్ లో స్వీటీ మునుపటి లుక్ లో కనిపిస్తూ సందడి చేస్తోంది. ప్రముఖ సెలబ్రిటీ ఫిట్ నెస్ ట్రైనర్ ల్యూక్ కౌటిన్హో..అందమైన బీచ్ తీరంలో అనుష్క ఫొటోషూట్ కు సంబంధించిన స్టిల్స్ ను షేర్ చేసుకున్నాడు. స్వీటీ ఫొటోలు ఆన్ లైన్ లో వైరల్ గా మారాయి.

2411
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles