ఊహించని ట్విస్ట్‌: బిగ్ బాస్3 హోస్ట్‌గా టాప్ హీరోయిన్ ?

Mon,April 22, 2019 09:55 AM

బిగ్ బాస్ .. హాలీవుడ్‌లో మొద‌లైన ఈ రియాలిటీ షో ఇప్పుడు ఇటు సౌత్‌, అటు నార్త్‌లోను త‌న హ‌వా చూపిస్తుంది. తెలుగులో ఈ షో తొలి సీజ‌న్‌ని ఎన్టీఆర్ హోస్ట్ చేయ‌గా, రెండో సీజ‌న్‌కి నాని హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించాడు. ఇక సీజ‌న్ 3 ఎప్పుడు మొద‌ల‌వుతుంది, ఎవ‌రు హోస్ట్ చేస్తారు అనే దానిపై కొన్నాళ్ళుగా హాట్ హాట్ చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి. ముందుగా మ‌ళ్ళీ ఎన్టీఆర్‌తోనే మూడో సీజ‌న్ హోస్ట్ చేయించ‌నున్నార‌ని వార్త‌లు వ‌చ్చిన‌, జూనియ‌ర్ ఆర్ఆర్ఆర్ ప్రాజెక్ట్‌తో బిజీగా ఉండ‌డం వ‌ల‌న అది సాధ్యం కాద‌ని తేల్చేసారు. బిగ్ బాస్ సీజ‌న్ 3 హోస్ట్ రేస్ నుండి ఎన్టీఆర్ తప్పుకోవ‌డంతో ఆయన స్థానంలో ఎవ‌రిని తీసుకోవాలా అని నిర్వాహ‌కులు త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతున్నారు.


మీలో కోటీశ్వ‌రుడు వంటి రియాలిటీ షోతో ఆక‌ట్టుకున్న నాగార్జుననే బిగ్ బాస్ 3 హోస్ట్ చేస్తార‌ని ఇటీవ‌ల వార్త‌లు వ‌చ్చాయి. కాని ఆయ‌న మ‌న్మ‌థుడు 2 చిత్రంతో పాటు సోగ్గాడే చిన్ని నాయ‌న సీక్వెల్స్‌తో బిజీగా ఉన్నాడు. ప్ర‌స్తుతం మ‌న్మ‌థుడు 2 చిత్రం పోర్చుగ‌ల్‌లో షూటింగ్ జ‌రుపుకుంటుంది. బిగ్ బాస్3 ని నాగ్‌ హోస్ట్ చేస్తార‌నే విష‌యంలో సందేహం నెల‌కొంది. అయితే బిగ్ బాస్ నిర్వాహ‌కులు ఈ సారి హోస్ట్ విష‌యంలో స‌రికొత్త‌గా ఆలోచిస్తున్నార‌ని తెలుస్తుంది. మూడో సీజన్‌కి హోస్ట్‌గా మేల్ కాకుండా ఫీమేల్ అయితే బాగుంటుంద‌ని వారు భావిస్తున్నార‌ట‌. ఈ మేర‌కు హీరోల‌తో స‌మానంగా ఇండ‌స్ట్రీలో దూసుకెళుతున్న అనుష్క‌కి బిగ్ బాస్ 3 హోస్ట్ బాధ్యతలను అప్ప‌గిస్తార‌ని టాక్. మ‌రి ఇందులో ఎంత నిజం ఉంద‌నేది తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే. అనుష్క త్వ‌ర‌లో హేమంత్ మ‌ధుక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో సైలెన్స్ అనే చిత్రం చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. మాధ‌వ‌న్ ,కిల్ బుల్ ఫేం మేఖేల్ మ్యాడ‌స‌న్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో క‌నిపించ‌నున్నారు.

బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్... సీజన్ 1 ఎన్టీఆర్ హోస్ట్‌గా 70 రోజుల పాటు 14 మంది సెలబ్రిటీలతో సంద‌డిగా సాగింది. గ‌తంలో ఎన్న‌డు లేనంత రేటింగ్స్ ఈ కార్య‌క్ర‌మం రాబ‌ట్టింది. ఈ సీజ‌న్‌లో శివ‌బాలాజీ విజేత‌గా నిలిచారు. 2017 జూలై 16న ఈ కార్య‌క్ర‌మం ప్రారంభ‌మైంది. ఇక రెండో సీజ‌న్ నాని హోస్ట్‌గా దాదాపు 113 రోజుల పాటు 18 మంది సెల‌బ్రిటీల‌తో సాగింది. 2018 జూన్ 10న సీజ‌న్ 2 స్టార్ట్ చేశారు. ఈ సీజ‌న్‌లో కౌశ‌ల్ విజేత‌గా నిలిచాడు.

4626
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles