బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న అర్జున్ రెడ్డి భామ‌

Wed,January 23, 2019 09:03 AM

అర్జున్ రెడ్డి చిత్రంతో వెండితెర ఆరంగేట్రం చేసిన అందాల భామ షాలిని పాండే. తొలి చిత్రంతోనే మంచి విజ‌యాన్ని త‌న ఖాతాలో వేసుకున్న ఈ అమ్మ‌డు ఆ త‌ర్వాత చెప్పుకోద‌గ్గ విజ‌యాలు అందుకోలేక‌పోయింది. ఇప్పుడు బాలీవుడ్‌లో అదృష్టాన్ని ప‌రీక్షించుకునేందుకు సిద్ధ‌మైంది. ప‌రేష్ రావ‌ల్ త‌న‌యుడు ఆదిత్య.. బాంఫాడ్ అనే చిత్రంతో బాలీవుడ్ డెబ్యూ ఇస్తుండ‌గా ఇందులో క‌థానాయిక‌గా షాలిని పాండే ఎంపికైంది. ఈ చిత్రం షాలిని కెరియ‌ర్‌కి చాలా ప్ల‌స్ అవుతుంద‌ని విశ్లేష‌కులు అంటున్నారు. బాంఫాడ్ చిత్రం రొమాంటిక్ ప్రేమ క‌థా చిత్రంగా తెర‌కెక్క‌నుండ‌గా, ఈ మూవీకి అనురాగ్ క‌శ్యప్ అసిస్టెంట్‌ రంజ‌న్ చందేల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నార‌ట‌. సినిమా షూటింగ్ ఎప్పుడో మొద‌లైన‌ప్ప‌టికి రీసెంట్‌గా ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన విష‌యాలు వెల్లడించాడు అనురాగ్. ఈ చిత్రానికి అనురాగ్ క‌శ్య‌ప్ స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హ‌రిస్తుండ‌గా, అజ‌య్ రాయ్ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

2452
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles