సాయిప‌ల్ల‌వి పాట‌కి అనుప‌మ క్యూట్‌ ఎక్స్‌ప్రెష‌న్స్‌

Sun,June 24, 2018 11:54 AM
anupama parameswaran imitates sai pallavi song

ఈ మ‌ధ్య కాలంలో డ‌బ్ స్మాష్ వాడ‌కం చాలా పెరిగింది. చిన్న పిల్లాడి నుండి పండు ముస‌లి వ‌ర‌కు సినిమాల‌లోని పాట‌లు లేదా డైలాగ్స్‌ని అనుక‌రిస్తూ సోష‌ల్ మీడియా స్టార్స్ అవుతున్నారు. తాజాగా మ‌ల‌యాళ బ్యూటీ అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ ఓ డ‌బ్ స్మాష్ వీడియో చేసి సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది. అయితే తాను చేసిన వీడియో త‌న సినిమాలోని పాట‌కి కాదండోయ్. ఫిదా బ్యూటీ సాయిప‌ల్ల‌వి త‌న డ్యాన్స్‌తో ఓ ఊపు ఊపిన హేయ్ పిల్ల‌గాడ‌.. అనే పాట‌కి . ఓ వ్య‌క్తి ని ప‌క్క‌న కూర్చోపెట్టుకొని హేయ్ పిల్ల‌గాడ సాంగ్‌కి అనుప‌మ చేసిన డ‌బ్ స్మాష్ ఎంత‌గానో అల‌రిస్తుంది. నెటిజన్స్ ఈ వీడియోపై పాజిటివ్‌గా రియాక్ట్ అవుతున్నారు. ఈ వీడియో ప్ర‌స్తుతం నెట్టింట్లో వైర‌ల్ అయి కూర్చుంది. ఇటీవ‌ల తేజ్ ఐ ల‌వ్ యూ అనే చిత్రంలో సాయిధ‌ర‌మ్ తేజ్ స‌ర‌స‌న క‌థానాయిక‌గా న‌టించింది అనుప‌మ‌. జూలై 6న ఈ చిత్రం విడుద‌ల కానుండ‌గా, రేపు సాయంత్రం 7గం.ల‌కి మూవీ ట్రైల‌ర్ విడుద‌ల కానుంది.

5428
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles