నాని మూవీలో ‘శర్వానంద్’ హీరోయిన్

Sat,September 23, 2017 08:34 PM
Anupama parameshwaran pair up with nani


హైదరాబాద్: శతమానంభవతి, ప్రేమమ్ చిత్రాలతో టాలీవుడ్‌లో తనకంటూ స్పెషల్ ఇమేజ్ సంపాదించుకుంది మాలీవుడ్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్. అనుపమ ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ మూవీస్‌లో నటించాలని ప్లాన్ చేసుకుంది. ప్రస్తుతం రామ్‌తో కలిసి ‘ఉన్నది ఒక్కటే జిందగీ’ సినిమాలో నటిస్తుందీ భామ. ఈ ప్రాజెక్టు సెట్స్‌పైకి ఉండగానే మరో సినిమాలో నటించే అవకాశాన్ని కొట్టేసింది అనుపమ. న్యాచురల్ స్టార్ నాని నటిస్తున్న కృష్ణార్జున యుద్ధం మూవీలో అనుపమ హీరోయిన్‌గా నటిస్తుంది. ఇప్పటివరకు లవ్‌లీ గాళ్‌గా కనిపించిన అనుపమ నాని మూవీలో సరికొత్త పాత్రలో కనిపిస్తుందట. మరి ఈ రెండు సినిమాలు కూడా అనుపమకు మంచి హిట్స్‌గా నిలువాలని మనమూ విష్ చేద్దాం. మేర్లపాక గాంధీ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాని డ్యుయల్‌రోల్‌లో కనిపించనున్నాడు.

1098
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles