మాజీ ప్రధాని మన్మోహన్‌కు అనుపమ్‌ఖేర్ శుభాకాంక్షలు

Wed,September 26, 2018 04:35 PM
Anupam Kher Birthday wishes to Manmohan Singh

ముంబై : మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు ప్రముఖ నటుడు, దర్శకుడు, నిర్మాత అనుపమ్‌ఖేర్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. గొప్ప విధేయత, నిజాయితీ కలిగిన వ్యక్తి. మన్మోహన్ సింగ్‌కు బర్త్ డే శుభాకాంక్షలు. మీరు ఎల్లప్పుడూ సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని కోరకుంటున్నట్లు ట్వీట్ చేశారు. మన్మోహన్ సింగ్ బయోపిక్ ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ సినిమాలో అనుపమ్‌ఖేర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే.

‘మీరు ఈ సినిమాలో నా (మన్మోహన్)పాత్రను చాలా ఇష్టపడతారని హామీనిస్తున్నా. ఈ పాత్ర పూర్తి విధేయత, నిజాయితీతో నిండి ఉంటుంది. ఈ సినిమా చూసిన తర్వాత మీతో కలిసి టీ తాగేందుకు, కేక్ కట్ చేసేందుకు ఓ అవకాశమొస్తుందని ఆశిస్తున్నానన్నారు’ అనుపమ్‌ఖేర్.

1382
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS