రీల్ ప్రియాంక‌, రాహుల్ గాంధీల‌ని ప‌రిచ‌యం చేసిన అనుప‌మ్‌

Thu,June 28, 2018 12:25 PM
anupam introduces rahul, priyanka

మాజీ ప్ర‌ధాన‌మంత్రి మ‌న్మోహ‌న్ సింగ్ జీవిత నేప‌థ్యంలో రూపొందుతున్న బ‌యోపిక్‌లో అనుప‌మ్ ఖేర్ ప్ర‌ధాన పాత్ర పోషిస్తున్న సంగ‌తి తెలిసిందే. మన్మోహన్ సింగ్ కు మీడియా సలహాదారుగా వ్యవహరించిన సంజయ్ బారు రాసిన పుస్తకం 'ది యాక్సిడెంటల్‌ ప్రైమ్‌ మినిస్టర్‌ : ది మేకింగ్‌ అండ్‌ అన్‌మేకింగ్‌ ఆఫ్‌ మన్మోహన్‌సింగ్‌' ఆధారంగా ‘ది యాక్సిడెంటల్‌ ప్రైమ్‌ మినిస్టర్‌’ చిత్రం తెరకెక్కుతుంది . సోనియా గాంధీ పాత్ర‌కి జ‌ర్మ‌న్ యాక్ట‌ర్ సుజానే బెర్నెర్ట్ ఎంపిక చేయ‌గా, ఆమె లుక్ కూడా ఇటీవ‌ల విడుద‌ల‌ చేశారు. సంజ‌య్ బారు పాత్ర‌లో అక్ష‌య్ ఖ‌న్నా న‌టించ‌నున్నాడు. డిసెంబ‌ర్ 21న బ‌యోపిక్ విడుద‌ల కానుంద‌ని తెలుస్తుండ‌గా, కొన్నాళ్ళుగా అనుప‌మ్ ఖేర్ చిత్రంకి సంబంధించిన పాత్ర‌ల‌ని ప‌రిచ‌యం చేస్తూ వ‌స్తున్నాడు.

కొద్ది సేప‌టి క్రితం సినిమాలో ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ పాత్ర‌లు పోషించిన వారి లుక్స్ విడుద‌ల చేశారు. రాహుల్ గాంధీగా అర్జున్ మాథూర్, ప్రియాంక గాంధీగా ఆహానా కుమ్రా నటించారు. వారు అచ్చం ప్రియాంక‌, రాహుల్‌లా ఉన్నారంటూ అనుప‌మ్ త‌న ట్విట్ట‌ర్ ద్వారా తెలిపారు. విజ‌య్ ర‌త్నాక‌ర్ గుత్తే తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రానికి సలీమ్‌-సలైమన్‌ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా 12 భాషల్లో ఈ బయోపిక్‌ని విడుదల చేసేందుకు ప్లాన్‌ చేశారని స‌మాచారం. ఆర్థికవేత్త నుంచి రాజకీయనాయకుడిగా మారి 2004 నుంచి 2014 వరకు యూపీఏ పక్షాన ప్రధానిగా పనిచేసిన మన్‌మోహన్‌సింగ్ బ‌యోపిక్ చిత్రం ప్ర‌తి ఒక్క‌రిని త‌ప్ప‌క అల‌రిస్తుంద‌ని టీం చెబుతుంది.1690
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles