తెలుగమ్మాయికి భలే ఛాన్స్

Wed,February 8, 2017 11:17 AM

చిన్న చిత్రంగా విడుదలై సంచలనం క్రియేట్ చేసిన చిత్రం పెళ్ళి చూపులు. మౌత్ టాక్ తో మంచి విజయం సాధించిన ఈ చిత్రం సినిమాలోని నటీనటులకు మంచి పేరు తీసుకొచ్చింది. పెళ్లి చూపులు చిత్ర హీరో విజయ్ దేవరకొండ ఇప్పటికే పలు ఆఫర్లతో ఫుల్ బిజీగా ఉండగా, కథానాయిక రీతూ వర్మ గొప్ప ఛాన్స్ అందుకుంది. విక్రమ్ ప్రస్తుతం గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ‘ధ్రువ నట్చత్తిరమ్’ అనే సినిమా చేస్తున్నాడు. ఇందులో జాన్ అనే గూడాఛారి పాత్రలో విక్రమ్ కనిపించనుండగా, ఈ చిత్రానికి సంబంధించి విడుదలైన పోస్టర్స్ ఆడియన్స్ లో ఫుల్ హైప్ తెస్తున్నాయి. సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో ఉన్న విక్రమ్ ని చూసి అభిమానులు.. తమ అభిమాన హీరోని హాలీవుడ్ హీరోతో పోల్చుకుంటున్నారు. స్పై థ్రిల్లర్ కాన్సెప్ట్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కథానాయికగా మొదట అను ఎమ్మాన్యూల్‌ని ఎంపిక చేశారు. కాని ఈ అమ్మడి డేట్స్ అడ్జెస్ట్ కాకపోవడంతో అను స్థానంలో రీతూ వర్మని హీరోయిన్ గా ఎంపిక చేశారట. ప్రస్తుతం ఈ అమ్మడిపై కొన్ని సన్నివేశాలు కూడా చిత్రీకరించినట్టు సమాచారం. ఆగస్ట్ నెలలో విడుదల కానున్న ఈ చిత్రం రీతూకి ఎలాంటి పేరు ప్రఖ్యాతలు తెస్తాయో చూడాలి.

2808
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles