గెస్ట్ పాత్ర‌లో అను ఎమ్మాన్యుయేల్‌ ..!

Fri,May 25, 2018 04:08 PM
Anu Emmanuel plays guest role in vijay devarakonda movie

నాని ప్రధాన పాత్రలో తెర‌కెక్కిన మజ్ఞు చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన‌ నటి అను ఇమ్మాన్యుయేల్. ఈ చిత్రంలో అమ్మడి నటనకు మంచి మార్కులు పడడంతో అజ్ఞాతవాసి చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన నటించే గోల్డెన్ ఛాన్స్ అందుకుంది. ఆ త‌ర్వాత బన్నీ సరసన నా పేరు సూర్య. . నా ఇల్లు ఇండియా అనే చిత్రంలోను నటించింది. ఇక ప్ర‌స్తుతం మారుతి ద‌ర్శ‌క‌త్వంలో చైతూ హీరోగా తెర‌కెక్కుతున్న శైల‌జా రెడ్డి అల్లుడు అనే చిత్రంలో కథానాయిక‌గా న‌టిస్తుంది. శ్రీను వైట్ల‌- ర‌వితేజ కాంబినేష‌న్‌లో తెర‌కెక్క‌నున్న అమ‌ర్ అక్భ‌ర్ ఆంటోని సినిమాలోను అను ఎమ్మాన్యుయేల్‌ని క‌థానాయిక‌గా తీసుకున్నారు. కాని డేట్స్ అడ్జెస్ట్ కాక‌పోవ‌డం వ‌ల‌న అను ఈ ప్రాజెక్ట్ నుండి త‌ప్పుకుంది. తాజాగా ఈ బ్యూటీ విజ‌య్ దేవ‌ర‌కొండ‌ సినిమాలో అతిథి పాత్రలో నటించేందుకు అంగీకరించినట్టుగా తెలుస్తోంది. అర్జున్‌ రెడ్డి సినిమాతో సెన్సేషనల్‌ స్టార్‌గా పేరు తెచ్చుకున్న విజయ్‌ దేవరకొండ టాక్సీవాలాతో ప్రేక్షకుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అయ్యాడు. ఈ సినిమా తరువాత పరుశురామ్‌ దర్శకత్వంలో గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌లో ఓ సినిమా చేస్తున్నాడు. ఇందులో గెస్టు రోల్ కి, క్రేజ్ వున్న హీరోయిన్ అయితే బాగుంటుందని భావించి అనూ ఇమ్మాన్యుయేల్ ను చిత్ర యూనిట్‌ సంప్రదించింద‌ట . గీతా ఆర్ట్స్ బ్యానర్ క్రేజ్‌ని దృష్టిలో పెట్టుకునే ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని చెప్పుకుంటున్నారు.

2740
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles