9న అంతరిక్షం ట్రైలర్ ఆవిష్కరణ వేడుక

Wed,December 5, 2018 10:13 PM
Anthariksham trailer to launch on december 9th

తెలుగులో తొలి స్పేస్ నేపథ్య కథాంశంతో రూపొందిన చిత్రం ‘అంతరిక్షం 9000 కేఎమ్ వరుణ్ లావణ్య త్రిపాఠి, అదితిరావు హైదరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. సంకల్ప్ దర్శకుడు. ఈ నెల 9న చిత్ర ట్రైలర్ ఆవిష్కరణ వేడుకను హైదరాబాద్ ఏఎంబీ సినిమాస్ మల్టీఫ్లెక్స్ లో నిర్వహించబోతున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘దసరా సందర్భంగా విడుదల చేసిన ట్రైలర్ మంచి స్పందన లభించింది.

ఇటీవలే విడుదలైన పాటలు కూడా శ్రోతల్ని ఆకట్టుకున్నాయి. వరుణ్ వ్యోమగామి పాత్రలో కనిపిస్తారు. ఆయన పాత్ర చిత్రణ నవ్యపంథాలో ఉంటుంది. తెలుగు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినిచ్చే చిత్రమవుతుంది’అని అన్నారు. వరుణ్ అదితిరావు హైదరి, లావణ్య త్రిపాఠి, సత్యదేవ్, శ్రీనివాస్ అవసరాల తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: జ్ఞానశేఖర్, సంగీతం: ప్రశాంతి విహారీ, నిర్మాతలు: రాధాకృష్ణ (క్రిష్), సాయిబాబు, రాజీవ్ నిర్మాణ సంస్థ: ఫస్ట్ ఎంటర్

1330
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles