'అంతరిక్షం' టీజర్ విడుదల

Wed,October 17, 2018 04:25 PM
Anthariksham  teaser released

వరుణ్ తేజ్ , అదితి రావు హైదరి, లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలలో సంకల్ప్ రెడ్డి తెరకెక్కిస్తున్న చిత్రం అంతరిక్షం. డిసెంబర్ 21న విడుదల కానున్న ఈ చిత్రం సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమా లో వరుణ్ వ్యోమగామిగా కనిపించనున్నాడు. హాలీవుడ్ టెక్నీషియన్స్ ఈ సినిమాకి పని చేస్తుండగా, విజువల్ ఎఫెక్ట్స్ ఈ చిత్రంలో ఆకర్షణగా నిలవనున్నాయని అంటున్నారు. దసరా కానుకగా కొద్ది సేపటి క్రితం చిత్ర టీజర్ విడుదల చేశారు. ఈ టీజర్ అభిమానులలో సినిమాపై భారీ అంచనాలు పెంచింది. గౌతమీపుత్ర శాతకర్ణి తో బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకొన్న ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ఘాజీ చిత్రంలానే ఈ సినిమా భారీ హిట్ అవుతుందని టీం భావిస్తుంది. ఈ మూవీకి ప్రశాంత్ ఆర్. విహారి సంగీతం అందిస్తున్నారు. వి.ఎస్. జ్ఞానశేఖర్ ఛాయా గ్రాహకుడు

2377
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles