అంత‌రిక్షం క్యారెక్ట‌ర్ వీడియోలు విడుద‌ల‌

Sun,December 9, 2018 08:52 AM
Anthariksham Character Videos

ఘాజీ ఫేం సంక‌ల్ప్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో వ‌రుణ్ తేజ్‌, లావ‌ణ్య‌ త్రిపాఠి, అధితి రావు హైద‌రీ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో తెర‌కెక్కుతున్న చిత్ర అంత‌రిక్షం. 9000 కెఎంపిహెచ్ అనేది ఉపశీర్షిక. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై క్రిష్ జాగర్లమూడి ఈ చిత్రాన్ని నిర్మించారు. పూర్తి స్థాయి సైన్స్ ఫిక్షన్‌‌గా ఈ చిత్రంలోని సన్నివేశాలను జీరో గ్రావిటీ సెట్స్‌‌పై చిత్రీకరిస్తున్నారు. హాలీవుడ్‌ స్థాయి టేకింగ్‌తో అద్భుతమైన విజువల్ వండర్‌గా ‘అంతరిక్షం’ ఉండబోతుందని టీజర్‌లో హింట్ ఇచ్చారు దర్శకుడు సంకల్ప్ రెడ్డి. ట్రాయ్, జీరో డార్క్, గేమ్ ఆప్ థ్రోన్స్ వంటి హాలీవుడ్ సినిమాకు పనిచేసిన టెక్నీషియన్స్ ఈ సినిమాకి పనిచేయడం మరో విశేషం. డిసెంబర్ 21న విడుదల కానున్న ఈ చిత్రంకి సంబంధించి ప్ర‌మోష‌న్ కార్య‌క్రమాలు మొద‌లు పెట్టారు మేక‌ర్స్‌. తాజాగా దేవ్ పాత్ర‌లో క‌నిపించ‌నున్న వ‌రుణ్ తేజ్‌, రియా పాత్ర‌లో క‌నిపించ‌నున్న అదితి రావు హైద‌రి, పార్వ‌తి పాత్ర‌లో క‌నిపించ‌నున్న లావ‌ణ్య త్రిపాఠిల క్యారెక్ట‌ర్ వీడియోల‌ని విడుద‌ల చేశారు. ఇవి అభిమానుల‌ని ఆక‌ట్టుకుంటున్నాయి. మ‌రి కొద్ది నిమిషాల‌లో చిత్ర టీజ‌ర్ కూడా విడుద‌ల కానుంది. ప్రశాంత్ ఆర్. విహారి చిత్రానికి సంగీతం అందిస్తుండ‌గా, త్వ‌ర‌లోనే ఆడియో విడుద‌ల చేయ‌నున్నారు

2108
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles