ఈ రోజే రేష్మి గౌత‌మ్‌ 'అంతం' విడుదల

Thu,July 7, 2016 09:44 AM
antham movie released today

'గుంటూరు టాకీస్' లాంటి సూప‌ర్‌డూప‌ర్ హిట్ చిత్రంతో యువ‌త హృద‌యాల్లో ప‌ర్మినెంట్ ప్లేస్ ని సొంతం చేసుకున్న ర‌ష్మిగౌతమ్ హీరోయిన్ గా ప్ర‌దాన‌పాత్ర‌లో న‌టించిన చిత్రం 'అంతం'. ద‌ర్శ‌క‌ నిర్మాత జి.ఎస్.ఎస్.పి.కళ్యాణ్ చాలా పెర్‌ఫెక్ట్ బ‌డ్జెట్ లో స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ గా తెర‌కెక్కించిన 'అంతం' లో చరణ్ దీప్ హీరోగా నటించారు. ఈ చిత్రం సెన్సారు వారి అభినంద‌న‌ల‌తో A స‌ర్టిఫికేట్ తో 300 కి పైగా థియేట‌ర్స్ లో విడుద‌ల‌వుతుంది. చరణ్ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించిన ఈ చిత్రానికి కార్తిక్ సంగీతమందించాడు.

'అంతం' చిత్రం ఇప్పటివరకు రాని అద్భుతమైన సస్పెన్స్ థ్రిల్లర్ అని దర్శక నిర్మాత జి.ఎస్.ఎస్.పి.కళ్యాణ్ తెలిపారు. గుంటూరు టాకీస్ చిత్రంలో చాలా మంచి ఫెర్‌ఫార్మెన్స్ ఇచ్చిన రష్మీ గౌతమ్ ఈ చిత్రంలోను గ్లామర్ తో పాటు టెర్రిఫిక్ పెర్ పార్మెన్స్ ఇచ్చిందని ఆయన తెలిపారు. అప్పుడే పెళ్ళి చేసుకున్న అంద‌మైన జంట జీవితంలోకి అనుకోని సంఘ‌ట‌న‌లు ఎదురై వారి జీవితాన్ని తుంచేస్తున్న స‌మ‌యంలో ఆ జంట ఎలా ఎదుర్కున్నారు.. అనేది ఈ చిత్ర ముఖ్య‌క‌థాంశం.గుంటూరు టాకీస్ చిత్రం త‌రువాత ర‌ష్మి న‌టించిన చిత్రం కావ‌టం తో ప్రేక్ష‌కుల్లో విప‌రీత‌మైన క్రేజ్ వుంది. ఆంధ్రప్ర‌దేశ్‌, తెలంగాణా, క‌ర్ణాట‌క క‌లిపి 300 దియోట‌ర్స్ కి పైగా చిత్రాన్ని విడుద‌ల చేస్తున్నట్టు కళ్యాణ్ పేర్కొన్నారు.

2675
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles